twitter

    కత్తి కాంతరావు స్టోరి

    కత్తి కాంతరావు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, కామ్న జట్మలానీ, కోట శ్రీనివాస్ రావు, అలీ, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చలపతి రావు, ఆహుతి ప్రసాద్, కృష్ణభగవాన్, ఎల్బి శ్రీరామ్, కొండవలస, రఘుబాబు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇవివి సత్యనారాయణ నిర్వహించారు మరియు నిర్మాత: ఎడుపుగంటి పూర్ణచంద్రరావు, ఈదర శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మల్లికార్జున్ స్వరాలు సమకుర్చారు.

    కథ

    కట్టుకున్న మొగుళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చందే అత్తింటికి వెళ్ళమని భీష్మించుకుని కూర్చున్న ఇద్దరు అక్కలు, ఎలాంటివాళ్ళని కట్టుకోవాలో అని ఊహించుకుంటూ కాలం గడిపే ఇద్దరు చెల్లెళ్ళు, తల్లి, తండ్రులను సాకాల్సిన భాధ్యత కొడుకుదే అని ఫిక్సైన తండ్రి. వంటావార్పు, అప్పుడప్పుడూ సెంటిమెంట్ ఆభరణంగా పెట్టుకున్న అమ్మ, వీళ్ళందరి కోరికలు తీరుస్తానని కమిటై కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న హీరో...ఇదీ కత్తుల కాంతారావు సెటప్. కత్తుల బోనులలాంటి ఇంట్లో వారందరి కోరికలు తీర్చటానికి ఈ కత్తి కాంతారావు(అల్లరి నరేష్) కరెప్టు(లంచావతారం) అవుతాడు. అందిన కాడికి నొక్కేస్తూ...ఇంట్లో అందరినీ తృప్తిపరచటానికి ప్రయత్నిస్తూంటాడు. చివరకు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి కూడా చేసుకోకుండా కుటుంబం కొవ్విత్తిలా కరిగిపోతూంటాడు. దానికి కారణం కుటుంబం పట్ల కాంతారావుకి సెంటిమెంట్ ఎక్కువ అవటం కాదు. అతని తండ్రికి రాసిచ్చిన ఎగ్రిమెంట్. ఏముందా ఎగ్రిమెంట్ లో అంటే...చేతకాని ఆ తండ్రి తనకు చేతనైనంతలో తెలివిని ఉపయోగించి ఉద్యోగాన్ని కొడుక్కి వాలంటరిగా ఇచ్చి రిటైరవుతూ...ఆ ఉద్యోగం ఇచ్చినందుకు ఎగ్రిమెంట్ క్రింద కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయాలని, అప్పటి వరకూ కాంతారావు పెళ్ళి గొడవ ఎత్తకూడదని కండిషన్ పెడతాడు. అందుకే అలా కాంతారావు అందర్ని మడతెడుతూంటాడు. అయితే ఇతని జీవితంలో ప్లాష్ బ్యాకే కాక మరో యాంగిల్ కూడా ఉంటుంది. ఎగ్రిమెంట్ ని ప్రక్కన పెట్టి రత్నం(కామ్న జట్మలాని)ని ఇంతకుముందే ప్రేమించి..పెళ్ళాడేసాడు. దాంతో ఈ విషయం ఇంట్లో తెలియకుండా మ్యానేజ్ చేస్తూ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేసాడు. తన వివాహాన్ని అఫీషియల్ గా ఎలా చేసుకున్నాడనేది మిగతా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie కత్తి కాంతరావు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X