X
తెలుగు » సినిమాలు » కత్తి కాంతరావు
కత్తి కాంతరావు

కత్తి కాంతరావు

Comedy | Romance | 10 Dec 2010 | U/A |
Telugu

3.3 /5 Users

2.5 /5 Filmibeat

కత్తి కాంతరావు స్టోరీ

కత్తి కాంతరావు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, కామ్న జట్మలానీ , కోట శ్రీనివాస్ రావు, అలీ, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చలపతి రావు, ఆహుతి ప్రసాద్, కృష్ణభగవాన్, ఎల్బి శ్రీరామ్, కొండవలస, రఘుబాబు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇవివి సత్యనారాయణ నిర్వహించారు మరియు నిర్మాత: ఎడుపుగంటి పూర్ణచంద్రరావు, ఈదర శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మల్లికార్జున్ స్వరాలు సమకుర్చారు. కథ కట్టుకున్న మొగుళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చందే అత్తింటికి వెళ్ళమని భీష్మించుకుని కూర్చున్న ఇద్దరు అక్కలు, ఎలాంటివాళ్ళని కట్టుకోవాలో అని ఊహించుకుంటూ కాలం గడిపే ఇద్దరు చెల్లెళ్ళు, తల్లి, తండ్రులను సాకాల్సిన భాధ్యత కొడుకుదే అని ఫిక్సైన తండ్రి. వంటావార్పు, అప్పుడప్పుడూ సెంటిమెంట్ ఆభరణంగా పెట్టుకున్న అమ్మ, వీళ్ళందరి కోరికలు తీరుస్తానని కమిటై కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న హీరో...ఇదీ కత్తుల కాంతారావు సెటప్. కత్తుల బోనులలాంటి ఇంట్లో వారందరి కోరికలు తీర్చటానికి ఈ కత్తి కాంతారావు(అల్లరి నరేష్) కరెప్టు(లంచావతారం) అవుతాడు. అందిన కాడికి నొక్కేస్తూ...ఇంట్లో అందరినీ తృప్తిపరచటానికి ప్రయత్నిస్తూంటాడు. చివరకు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి కూడా చేసుకోకుండా కుటుంబం కొవ్విత్తిలా కరిగిపోతూంటాడు. దానికి కారణం కుటుంబం పట్ల కాంతారావుకి సెంటిమెంట్ ఎక్కువ అవటం కాదు. అతని తండ్రికి రాసిచ్చిన ఎగ్రిమెంట్. ఏముందా ఎగ్రిమెంట్ లో అంటే...చేతకాని ఆ తండ్రి తనకు చేతనైనంతలో తెలివిని ఉపయోగించి ఉద్యోగాన్ని కొడుక్కి వాలంటరిగా ఇచ్చి రిటైరవుతూ...ఆ ఉద్యోగం ఇచ్చినందుకు ఎగ్రిమెంట్ క్రింద కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయాలని, అప్పటి వరకూ కాంతారావు పెళ్ళి గొడవ ఎత్తకూడదని కండిషన్ పెడతాడు. అందుకే అలా కాంతారావు అందర్ని మడతెడుతూంటాడు. అయితే ఇతని జీవితంలో ప్లాష్ బ్యాకే కాక మరో యాంగిల్ కూడా ఉంటుంది. ఎగ్రిమెంట్ ని ప్రక్కన పెట్టి రత్నం(కామ్న జట్మలాని)ని ఇంతకుముందే ప్రేమించి..పెళ్ళాడేసాడు. దాంతో ఈ విషయం ఇంట్లో తెలియకుండా మ్యానేజ్ చేస్తూ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేసాడు. తన వివాహాన్ని అఫీషియల్ గా ఎలా చేసుకున్నాడనేది మిగతా కథ.
Read More

కత్తి కాంతరావు కాస్ట్ & క్రూ

కత్తి కాంతరావు సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఇవివి సత్యనారాయణ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మల్లికార్జున్
నిర్మాత ఈదర శ్రీనివాస్, ఎడుపుగంటి పూర్ణచంద్ర రావు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కత్తి కాంతరావు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కామిడి చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ అయిన ఇవివి సత్యనారాయణ ఆయన కుమారుడు అయిన కామిడీ హీరో అల్లరి నరేష్ తో సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ అనేది సగటు ప్రేక్షకుడు నమ్మకం. అందుకు తగ్గట్లుగానే కత్తులు కాంతారవు..శక్తి వంచన లేకుండా ప్రతీ సీన్ లోనీ నవ్వులు అయితే కురిపించాడు కానీ, సెకెండాప్ సగం దాకా కథ లోకి, సమస్యలోకి రాకపోవటం విసుగెత్తిస్తుంది. కథకు సంభంధంలేని జోక్స్ వచ్చి నవ్విస్తూ, అప్పటికప్పుడు ఎంగేజ్ చేసినా టోటల్ గా ఏమిటి మనం చూస్తున్నాము అని ఆలోచనలో పడేస్తుంది. అయితే కేవంల కాస్సేపు కాలక్షేపం కోసం వెళ్ళే వారికి మాత్రం మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం నిరాసపరచదు.

కత్తి కాంతరావు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
3.3 /5 Your Rating

కత్తి కాంతరావు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+