కవచం సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్, నెయిల్ నితిన్ ముఖేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస్ మమిల్ల వహించారు మరియు నిర్మాత నవీన్ సొంటినేని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ అందించారు.
కథ విశాఖపట్నంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విజయ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్). ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కంటుంటాడు. ఓ సంయుక్త (కాజల్ అగర్వాల్)ను చూసి ప్రేమిస్తాడు. ఓ కారణంగా విజయ్‌కి లావణ్య దూరమవుతుంది. ఆ క్రమంలో ఓ సమస్యలో చిక్కుకున్న లావణ్య (మెహ్రీన్)ను విజయ్ కాపాడుతాడు. కానీ తన పేరు ప్రముఖ కంపెనీ అధినేత మేనకోడలు సంయుక్త అని అబద్ధం ఆడుతుంది. ఇలాంటి నేపథ్యంలో విజయ్‌కి రూ.50 లక్షల డబ్బు అవసరం అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో లావణ్యను సంయుక్తగా భావించి విజయ్ కిడ్నాప్ చేసినట్టు డ్రామా ఆడుతాడు. కానీ విక్రమాదిత్య ఆడిన కిడ్నాప్ డ్రామాలో విజయ్ చిక్కకుంటాడు.
విజయ్‌కి సంయుక్త ఎందుకు దూరమైంది? లావణ్య తన పేరును ఎందుకు సంయుక్త అని చెప్పుకొన్నది. కిడ్నాప్ డ్రామాలో విక్రమాదిత్యకు ఉన్న ప్రయోజనం ఏమిటి? చివరకు తనపై వచ్చిన కిడ్నాప్ ఆరోపణల నుంచి విజయ్ ఎలా తప్పించుకొన్నాడు. విజయ్‌కి సంయుక్తం చేరువైందా? లావణ్య సమస్యల నుంచి గట్టెక్కిందా అనే ప్రశ్నలకు సమాధానమే కవచం సినిమా కథ.