X
కేశవ
Action | Thriller | 19 May 2017 | U/A | 116 Mins
Telugu

కేశవ స్టోరీ

కేశవ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నిఖిల్, రితూ వర్మ, ఇషా కొప్పికర్, రావు రమేష్, అజయ్, బ్రహ్మాజి, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుధీర్ వర్మ నిర్వహించారు మరియు నిర్మాత అభిషేక్ నామా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సన్నీ యం ఆర్ స్వరాలు సమకుర్చరు.

కథ

కేశవ్ శర్మ (నిఖిల్ సిద్ధార్థ్) న్యాయశాస్త్ర విద్యార్థి. ఎప్పుడు ఏదో పొగ్గొట్టుకున్న వాడిలా కేశవ్ ముభావంగా ఉంటాడు. తల్లిదండ్రులు లేని అనాధ. శారీరక వైకల్యంతో బాధపడే చెల్లెలు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు పోలీసు అధికారులను హత్యచేయాలని నిర్ణయించుకొంటాడు. అలా వరుసపెట్టి ముగ్గురు పోలీసు అధికారులను (రాజా రవీంద్రతోపాటు మరో ఇద్దరు) హత్య చేస్తాడు. బాల్య స్నేహితురాలు సత్యభామ (రీతూవర్మ) సహా విద్యార్థి ఈ విషయాన్ని పసిగడుతుంది. కేశవ్ చేసే వరుస హత్యలు వైజాగ్ పరిసర ప్రాంతంలో సంచలనం రేపుతుంటాయి. హత్యలపై నిగ్గుతేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తారు. హత్యల గురించి పరిశోధన చేపట్టిన అధికారి (ఇషా కొప్పికర్) చివరికి కేశవ్‌ను అరెస్ట్ చేస్తుంది. అతడే హత్యలకు కారణమని నిర్ధారిస్తుంది. కానీ ఆధారాలు లేకపోవడంతో అతడిని విడుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తారు. దాంతో కేశవ్ బయటకు వస్తాడు. కానీ కేశవ్ జాబితాలో మరో ఇద్దరు అధికారులు (బహ్మాజీ, అజయ్) ఉన్నారని దర్యాప్తు అధికారి గుర్తిస్తుంది. ఆ ఇద్దరు పోలీసు ఆఫీసర్లను రక్షించేందుకు సిట్ బృందం చర్యలు చేపడుతుంది. మిగిలిన ఇద్దరు పోలీసు అధికారులను కేశవ్ ఎలా చంపాడు. అసలు పోలీసు అధికారులను కేశవ్ ఎందుకు చంపుతున్నాడు. ఎందుకు కేశవ్ తల్లిదండ్రులు చనిపోయారు? తన కేశవ్ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి? ఈ మర్డర్ మిస్టరీలో రావు రమేశ్ పాత్ర ఏంటీ అనే ప్రశ్నలకు సమాధానమే ‘కేశవ్‘ చిత్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+