X
కేశవ

కేశవ

Action | Thriller | 19 May 2017 | U/A | 116 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

కేశవ స్టోరీ

కేశవ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నిఖిల్, రితూ వర్మ, ఇషా కొప్పికర్, రావు రమేష్, అజయ్, బ్రహ్మాజి, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుధీర్ వర్మ నిర్వహించారు మరియు నిర్మాత అభిషేక్ నామా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సన్నీ యం ఆర్ స్వరాలు సమకుర్చరు. కథ కేశవ్ శర్మ (నిఖిల్ సిద్ధార్థ్) న్యాయశాస్త్ర విద్యార్థి. ఎప్పుడు ఏదో పొగ్గొట్టుకున్న వాడిలా కేశవ్ ముభావంగా ఉంటాడు. తల్లిదండ్రులు లేని అనాధ. శారీరక వైకల్యంతో బాధపడే చెల్లెలు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు పోలీసు అధికారులను హత్యచేయాలని నిర్ణయించుకొంటాడు. అలా వరుసపెట్టి ముగ్గురు పోలీసు అధికారులను (రాజా రవీంద్రతోపాటు మరో ఇద్దరు) హత్య చేస్తాడు. బాల్య స్నేహితురాలు సత్యభామ (రీతూవర్మ) సహా విద్యార్థి ఈ విషయాన్ని పసిగడుతుంది. కేశవ్ చేసే వరుస హత్యలు వైజాగ్ పరిసర ప్రాంతంలో సంచలనం రేపుతుంటాయి. హత్యలపై నిగ్గుతేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తారు. హత్యల గురించి పరిశోధన చేపట్టిన అధికారి (ఇషా కొప్పికర్) చివరికి కేశవ్‌ను అరెస్ట్ చేస్తుంది. అతడే హత్యలకు కారణమని నిర్ధారిస్తుంది. కానీ ఆధారాలు లేకపోవడంతో అతడిని విడుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తారు. దాంతో కేశవ్ బయటకు వస్తాడు. కానీ కేశవ్ జాబితాలో మరో ఇద్దరు అధికారులు (బహ్మాజీ, అజయ్) ఉన్నారని దర్యాప్తు అధికారి గుర్తిస్తుంది. ఆ ఇద్దరు పోలీసు ఆఫీసర్లను రక్షించేందుకు సిట్ బృందం చర్యలు చేపడుతుంది. మిగిలిన ఇద్దరు పోలీసు అధికారులను కేశవ్ ఎలా చంపాడు. అసలు పోలీసు అధికారులను కేశవ్ ఎందుకు చంపుతున్నాడు. ఎందుకు కేశవ్ తల్లిదండ్రులు చనిపోయారు? తన కేశవ్ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి? ఈ మర్డర్ మిస్టరీలో రావు రమేశ్ పాత్ర ఏంటీ అనే ప్రశ్నలకు సమాధానమే ‘కేశవ్‘ చిత్రం.
Read More

కేశవ కాస్ట్ & క్రూ

కేశవ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సుదీర్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సన్ని ఎమ్ ఆర్
నిర్మాత అభిషేక్ నామా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కేశవ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
స్వామి రారా, దోచెయ్ లాంటి సినిమాలు దర్శకుడు సుధీర్ వర్మ ప్రతిభకు అద్దం పట్టాయి. ఈ క్రమంలో ఆయన దర్శకత్వంలో వస్తున్న కేశవ్ చిత్రం కూడా విభిన్నంగా ఉంటుందని ఆశించడం సహజం. కానీ ప్రేక్షకులు అంచనాలకు భిన్నంగా రొటీన్ కథ, కథనాలతో కేశవ్ కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అందుకు నిఖిల్‌ రూపు రేఖలను, బాడీ లాగ్వేజి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొన్నాడు. ఆరంభంలో ఏదో వైవిధ్యమున్న సినిమానే చూడబోతున్నామనే ఫీలింగ్‌ను కల్పించాడు. కానీ సన్నివేశాలు, డైలాగ్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి. మర్డర్ మిస్టరీ అంటే తర్వాత సన్నివేశంలో ఏం జరుగుతుందో అనే ఇంట్రస్ట్ క్రియేట్ కావాలి. సినిమాలోని సన్నివేశాలను చాలా సులభంగా ఊహించే విధంగా ఉంటాయి. కథలో దమ్ము లేకపోవడం ఈ సినిమాకు మొదటి మైనస్ పాయింట్. ప్రతిభావంతులైన దర్శకులకు కథ అక్కర్లేదని కొందరు డైరెక్టర్లను చూస్తే అర్థమవుతుంది. సులభమైన కథను చాలా ఎమోషన్‌లా, పక్కాగా చెప్పినప్పుడే ప్రేక్షకుడు సినిమాలో లీనమవుతాడు. ట్విస్టులు, చమక్కులు ప్రేక్షకుడిని మైమరిపించే విధంగా చేస్తాయి. స్వామి రారా విషయంలో ప్రేక్షకుడి ఫీలయైన విషయం అదే. అందుకే ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు లేని సినిమాను బాగా ఆదరించారు. కేశవ్ చిత్రం దానికి పూర్తిగా వ్యతిరేకమైంది. కథలో లోటుపాట్లు ఉన్నా కథనంపైనా దృష్టిపెట్టి ఉంటే కొంతలో కొంతనైనా ప్రేక్షకుడికి సంతృప్తి మిగిలి ఉండేది.

కేశవ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కేశవ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+