కొమరం పులి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, నిఖీషా పటేల్, బ్రహ్మాజి, ఆలీ, గిరీష్ ఖర్నాడ్, శ్రియ, మనోజ్ భాజ్ పేయ్, చరణ్ రాజ్, నాజర్, తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ జె సూర్య నిర్వహించారు మరియు నిర్మాత శింగనమల రమేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చారు.
కథ
నీతి నిజాయితి గల పోలీసు అధికారి.....ఒకానొక సందర్బంలో నో పార్కింగ్ చోట ఉన్న డాన్ సలీమ్ కార్నీ బ్లాక్ చేస్తాడు పులి. ఆది తెలుసుకున్న డాన్ సలీమ్(మనోజ్ భాజ్ పేయ్) తన ఇమేజ్ నీ పరువుని తీసినందుకు పగపడతాడు. కానీ పులి మాత్రం అతని బ్యాక్ గ్రౌడ్ తెలుసుకుంటాడు. ఆది ఏమిటి అంటే అతను ఒక పెద్ద డాన్. ఎక్కడ నుంచో మనుషులని పంపి టెర్రరిజం చేయిస్తుంటాడు. ఇది కనుకున్న పులి డాన్ మీద నిగా పెంచుతాడు. హాంగ్ ఖాంగ్ లో ప్రైమ్ మినస్టర్ (గిరీష్ ఖర్నాడ్)ను టర్రరిస్ట్ ల నుండి కాపాడుతాడు. దాంతో ప్రైమ్ మినిష్టర్ తో ప్రశంసలు పొందుతాడు. దాంతో పవన్ పులి స్పెషల్ ఆపీసర్ గా నియమింపబడి పులీ టీమ్ అప్ అయ్యి అమాయక జనాలను కాపాడుతాడు.
ఇది ఇలా ఉండగా, ఇదే శాఖ లో పనిచేస్తున్న మధుమతి (నిఖీషా పటేల్) పులి మీద మనసు పడుతుంది. కానీ వృత్తే దర్మంగా బావించి. మొదట్లో పట్టించుకోడు. కానీ తర్వాత ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు. అదే సమయంలో డాన్ 'పులి" కోసం ఒక నిజం తెలుసుకుంటాడు. అది ఏంటంటే పులి మదర్ శరణ్య భర్తను వెతుకుతూ కనపడటంతోనే మొదలవుతుంది సినిమా ఆయనే పులి నాన్న 'నాజర్" ఎసిపి అని. నాజర్ డాన్ కేసు మొదట్లో చూస్తాడు. తన పనికి ఆడ్డు వస్తున్నాడని, నాజర్ ని చంపించేస్తాడు డాన్. ఈ విషయం పులి కీ కూడా తెలుస్తుంది. దీంతో మరింత పగ పెంచుకుంటాడు. ఆ డాన్ ను అంతమోందించే పనిలో ఇన్ వెస్టిగేషన్ లో డాన్ ఉన్న ప్లేస్ లో డాన్సర్ శ్రియా తో పరిచయం చేసుకొని ఇన్ వెస్టిగేట్ చేస్తాడు. ఆ పగ నిఖీషా ప్రాణాన్ని తీసుకుంటుంది. దాంతో ఎట్లాగైయినా దేశాన్ని డాన్ నుంచి రక్షించాలని, ఎసిపి దగ్గర నుండి పెన్ డ్రైవ్ ద్వారా విషయాలన్ని కనుకొని డాన్ పనిపట్టి కథ క్లైమాక్స్ లో భారీ డైలాగ్స్ తో 'పులి" అనిపించుకుంటాడు.