X
Home టాప్ లిస్టింగ్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త 5 సినిమాల వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌

Author Administrator | Updated: Friday, July 28, 2023, 09:01 PM [IST]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల లోపు త‌న చేతిలో ఉన్న సినిమాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో క‌లిసి న‌టించిన `బ్రో` మూవీతో జూలై 28న సంద‌డి చేయ‌బోతున్నారు. ఈ సినిమా త‌మిళ చిత్రం `వినోద‌య సిత్తం`కు రీమేక్‌. ఇద్ద‌రు మెగా హీరోల కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమా కావ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా ఏ మేర‌కు క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తుంద‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తి రేపుతోన్న అంశ‌మే. అయితే ఇంతకు ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త 5 సినిమాలు సాధించిన గ్రాస్ క‌లెక్ష‌న్స్ వివ‌రాల‌ను ఓసారి ప‌రిశీలిద్దాం...


cover image
భీమ్లా నాయక్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం భీమ్లా నాయ‌క్. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌కు ఇది రీమేక్‌. గ‌త ఏడాది విడుద‌లైన ఈ చిత్రంలో రానా ద‌గ్గుబాటి కూడా కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా హిట్ టాక్‌తో రూ.160 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల‌ను సాధించింది. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ సినిమా స్క్రీన్ ప్లే, మాట‌లు, పాట‌ను త్రివిక్ర‌మ్ రాయటం విశేషం. 

వకీల్ సాబ్

జ‌న‌సేన పార్టీతో సినిమాల‌కు కొంత కాలం దూరంగా ఉంటూ వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. 2021లో విడుద‌లైన ఈ చిత్రం బాలీవుడ్ మూవీ పింక్‌కి రీమేక్‌. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.140 కోట్లు గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా మేకింగ్‌లోనూ త్రివిక్ర‌మ్ కీల‌క భూమిక‌ను పోషించారు. 

అజ్ఞాతవాసి

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూడో సినిమా. అంత‌కు ముందు వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు హిట్ కావ‌టంతో అజ్ఞాత‌వాసిపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. అయితే ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. సినిమాకు నెగెటివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ బేస్‌, క్రేజ్‌తో సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.105 కోట్లు గ్రాస్ వ‌సూళ్ల‌ను సినిమా రాబ‌ట్టుకోవ‌టం విశేషం. 

సర్దార్ గబ్బర్ సింగ్

గ‌బ్బ‌ర్ సింగ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్. అదే టైటిల్‌కు స‌ర్దార్ అనే జ‌త చేసి రూపొందిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ కోసం ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు, ట్రేడ్ వ‌ర్గాలు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశాయి. డైరెక్టర్ బాబీ తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. అయితేనేం మూవీకి వ‌రల్డ్ వైడ్‌గా రూ.85 కోట్లు గ్రాస్ రావ‌టం హాట్ టాపిక్‌గా మారింది. అంటే సినిమా ఎలా ఉన్నా, ప‌వ‌న్ మూవీకి మినిమం క‌లెక్ష‌న్స్ ఉంటాయ‌ని మ‌రోసారి ఇది ప్రూవ్ చేసింది. 

కాటమరాయుడు

గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్, శ్రుతీ హాస‌న్ జంట‌గా న‌టించిన చిత్రం కాట‌మ రాయుడు. కిషోర్ కుమార్ పార్థ‌సాని అలియాస్ డాలీ తెర‌కెక్కించిన ఈ సినిమా త‌మిళ చిత్రం వీర‌మ్‌కు రీమేక్‌. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. రూ.97 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్ సాధించింది కాట‌మ‌రాయుడు మూవీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+