కొంచెం ఇష్ణం కొంచెం కష్ణం సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్దార్ధ, తమన్నా, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, నాజర్, బ్రహ్మానందం, వేణుమాధవ్, సుధ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,దర్శకత్వం: కిషోర్ కుమార్ నిర్వహించారు మరియు నిర్మాతా నల్లమలుపు కిషోర్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీదర్శకుడు శంకర్ ఇషన్ లయ్ స్వరాలు సమకుర్చారు.
కథ
తల్లి, తండ్రులు విడివిడిగా ఉన్నా హ్యాపీగా ఉంటున్న కుర్రాడు సిద్దు(సిద్దార్ధ). అతని జీవితంలోకి తండ్రి చాటు బిడ్డ గీతా సుబ్రమణ్యం(తమన్నా) ప్రవేశిస్తుంది. ఎప్పటిలాగే మొదట ఎడమొహం పెడమొహంగా ఉన్నా...తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆలస్యం ఎందుకని ఆమె ఇంటికెళ్ళి ప్రపోజల్ పెడతారు. అప్పుడామె తండ్రి (నాజర్)సిద్దుకి ఓ కండీషన్ పెడతాడు. ముందు విడిపోయిన మీ అమ్మా నాన్నను (రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్)ని కలుపు..అప్పుడు ఆలోచిస్తాను అంటాడు. ఎందుకంటే అటువంటి కుటుంబంలోని నా కూతర్ని ఎలా పంపుతాను అంటాడు. ఆ పరిస్ధితుల్లో సిద్దు ఏం డెషిషన్ తీసుకున్నాడు...చివరకి వాళ్ళ ప్రేమ కథ ఎలా సుఖాంతమైంది అన్నదే మిగతా కథ.