లాల్ సింగ్ చడ్డా మూవీ కామెడీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆమీర్ ఖాన్, అక్కినేని నాగ చైతన్య,కరీనా కపూర్ నటీ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అద్వైత్ చందన్ వహించారు. ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారేలు సంయుక్తంగా నిర్మించారు.
‘లాల్ సింగ్ చెడ్డా’. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన మూవీ
కథ
సైన్యంలో సేవలందిస్తూ అమరులైన కుటుంబానికి చెందిన లాల్ సింగ్ చద్దా (అమీర్ ఖాన్) బాల్యంలో రెండు కాళ్లు పనిచేయని అంగవైకల్యంతో బాధపడుతుంటాడు. తల్లి చాటు బిడ్డగా పెరిగిన లాల్‌కు బాల్యంలో కొన్ని అవమానాలను ఎదుర్కొంటారు. అయితే తన బాల్య స్నేహితురాలు రూప (కరీనా కపూర్ ఖాన్) అందించిన మానసిక స్థైర్యంతో కొన్ని పరిస్థితుల వల్ల అంగవైకల్యం నుంచి బయటపడటమే కాకుండా జీవితంలో పరుగు మొదలుపెడుతాడు. తల్లి కోరిక మేరకు ఆర్మీలో చేరుతాడు. కార్గిలో యుద్ధంలో గాయానికి గురైన లాల్ సైన్యం నుంచి రిటైర్ అవుతాడు. లాల్ సింగ్ బాల్యంలో చోటుచేసుకొన్న పరిస్థితులు ఏమిటి? స్నేహితురాలైన రూప ప్రేమలో ఎందుకు పడ్డాడు. సినీ నటి కావాలనుకొన్న రూప ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నది? లాల్ జీవితంలో తారసపడిన బాలరాజు (నాగచైతన్య) కథేంటి? బాలరాజు జీవిత లక్ష్యాన్ని లాల్ పూర్తి చేశాడా? సైన్యంలో ఉండగా లాల్‌కు బాలరాజు ఎలా అండగా ఉన్నాడు? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన రూపతో జీవితం ఎలా సాగింది? రూప, లాల్ కలుసుకోవడానికి ఏర్పడిన అవాంతరాలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే లాల్ సింగ్ చద్దా సినిమా కథ.