లెహరాయి సినిమా డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రంజిత్ సొమ్మి, సౌమ్య మీనన్, రావు రమేష్, ఆలీ, వీకే నరేష్, సత్యం రాజేశ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామకృష్ణ పరమహంస వహించారు. నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు. సంగీతం ఘంటాడి కృష్ణ అందించారు.
కథ
డాక్టర్ పురుషోత్తం (రావు రమేష్)కు కూతురు మేఘన (సౌమ్య మీనన్) తన ప్రాణానికి కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. తనకు తెలియకుండా కూతురు ఎలాంటి నిర్ణయం తీసుకోదనే గట్టి నమ్మకంతో ఉంటాడు. చదువు తప్ప లవ్ లాంటి మరో విషయంపై దృష్టిపెట్టని మేఘన.. తన కాలేజీలో సహ విద్యార్థి కార్తీక్ (రంజిత్ సొమ్మి)కు ప్రపోజ్ చేయడం తండ్రి పురుషోత్తానికి షాక్ తగులుతుంది. కార్తీక్‌కు మేఘన ఎందుకు ప్రపోజ్ చేయాల్సి వచ్చింది? కూతురు చేసిన పనికి పురుషోత్తం ఎలా రియాక్ట్ అయ్యాడు. మేఘన ప్రపోజ్ చేసిన తర్వాత కార్తీక్ ఎలా రియాక్ట్ అయ్యాడు? కార్తీక్‌పై నిజంగానే మేఘనకు ప్రేమ ఉందా? కార్తీక్, మేఘన ప్రేమను తండ్రి పురుషోత్తం అంగీకరించాడా? కార్తీక్ జీవితంలో జరిగిన చేదు సంఘటన ఏమిటి? కార్తీక్ లైఫ్‌లో జరిగిన సంఘటనతో డాక్టర్ పురుషోత్తానికి సంబంధం ఏమిటి? కాలేజీలో రౌడీ (గగన్ విహారి)ని కార్తీక్ ఎలా అడ్డుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే లెహరాయి సినిమా కథ.