లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జారా, రష్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్, అమల, శ్రియ, అంజలా జవేరి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శేఖర్ కమ్ముల నిర్వహించారు మరియు నిర్మాతలు: చంద్రశేఖర్ కమ్ముల, శేఖర్ కమ్ముల కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జె.మేయర్ స్వరాలు అందించారు.
కథ
అమల తన కొడుకు శ్రీను (అభిజీత్) ని,మిగతా ఇద్దరు పిల్లలని ఓ సంవత్సరం పాటు తనకు దూరంగా వాళ్ల మామయ్య గారి ఊరైన హైదరాబాద్ పంపుతుంది. కొత్తగా వారు చేరిన సన్‌షైన్ వ్యాలీ ప్రాతంలో నాగరాజ్ (సుధాకర్), అభి (కౌశిక్), సత్య (రష్మి), లక్ష్మి (జారా) వంటి రకరకాల పాత్రలు పరిచయమవుతాయి. ముఖ్యంగా తమ మామయ్య ఉండే మధ్య తరగతి కాలనీకు, ప్రక్కనే ఉండే డబ్బున్న వాళ్ళ కాలనీకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని తెలుసుకుంటారు. దానికితోడు తమ మామ కూతురు పద్దు (షగుణ్)తో శ్రీను ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆ కాలనీలో మరిన్ని లవ్ స్టోరీలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ ప్రేమ కథలు ఓ కొలిక్కి వచ్చాయా...కాలనీల మధ్య తగువులు ఏమిటి.... అలాగే అమల అసలు ఎందుకు తమ పిల్లలను వదిలి ఉండమని పంపింది...కథలో పారు (శ్రియ) పాత్ర ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.