లింగా సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో
రజనీకాంత్,
అనుష్క,
సోనాక్షి సిన్హా మరియు జగపతి బాబు, సుధీప్ వీళ్ళందరు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈసినిమాకు కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు, మరియు రాక్ లైన్ ప్రోడక్షన్స్ పతాకంపై రాక్ లైన్ వెంకటేశ్ నిర్మించారు. ఈ చిత్రానికి ఎ ఆర్
రెహమాన్ సంగీతం సమకూర్చారు.
కథ
లింగా(రజనీ) ఓ చిన్న దొంగ...అతని ఫ్రెండ్స్(సంతానం)తదితరులతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూన్న అతన్ని పబ్లిక్ టీవి రిపోర్టర్ లక్ష్మి(అనుష్క) ఓ సారి జైలు నుంచి బయిటకు తీసుకు వస్తుంది. అయితే ఓ కండీషన్ పెడుతుంది..అదేమిటంటే... శింగనూర్ అనే ఓ గ్రామం వచ్చి అక్కడ అతని తాతగారు రాజా లింగేశ్వర(ఇంకో రజనీ) కట్టించిన గుడిని ఓపెన్ చెయ్యాలని. అయితే మొదట లింగా రిజెక్టు చేస్తాడు...తమని ఈ దొంగతనాలు చేసే స్ధితికి వెళ్ళేలే చేసి, దరిద్రంలో వదిలిన తమ తాత అంటే అసహ్యమని చెప్తాడు. అయితే తప్పని సరి పరిస్దితుల్లో అక్కడికి వెళ్తాడు. అక్కడ లక్ష్మి తాతగారు(కె. విశ్వనాధ్) ఆ గుడి గురించి ఓ రహస్యం చెప్తాడు. అది విన్న లింగా ఆ గుడిని ఓపెన్ చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అయితే లోకల్ ఎంపి నాగ భూషణం(జగపతిబాబు) అతనో దొంగ అని కుదరదంటాడు. ఈ లోగా లింగా తన తాతగారి గురించి ఓ షాకింగ్ నిజం తెలుసుకుంటాడు. ఆయన గద్వాల్ రాజా లింగేశ్వరావు అని... ఆ రోజుల్లోనే(1940) కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన ఓ ఇంజినీంరు అని, మధురై కలెక్టర్ అని అర్దం చేసుకుంటాడు. అంత గొప్ప తన తాత తాము ఎందుకు ఇలా దరిద్రంతో బ్రతకాల్సి వస్తోంది. ఆ గుడికి ఉన్న రహస్యం ఏమిటి...ఇంతకీ తన తాత కట్టించిన డ్యామ్ గురించి అతను ఏం తెలుసుకున్నాడు..ఏం చేసాడు...మిగతా విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.