

Click it and Unblock the Notifications
2022లో అపుడే ఆరు నెల పూర్తయింది. ఈ ఆరు నెలల కాలంలో ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు విడుదలయ్యాయి. జనవరి నుంచే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వరుసగా సినిమాలు పలకరించాయి. అందులో కొన్ని హిట్టైయి నిర్మాతలకు లాబాలను తీసుకొస్తే.. మరికొన్ని ఎపుడు రిలీజ్ అయ్యాయో పత్తా లేకుండా పోయాయి. ఈ 6 నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకొచ్చి, వినోదం పంచిన చిత్రాల ‘ఫ్లాష్‌బ్యాక్’ చూస్తే..
జనవరి 1న రామ్‌గోపాల్ వర్మ ‘ఆశా ఎన్‌కౌంటర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక ప్లాప్ గా నిలిచింది
2022 జనవరి 1న థియేటర్స్‌లో విడుదలైన చిత్రం ‘ఇందువదన’.ఈ చిత్రం రిలీజైన సంగతి కూడా చాలా మందికి తెలియదు... బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది
జనవరి 7న విడుదలైన 1945 సినిమాను చూసిన ప్రేక్షకులు.. క్లైమాక్స్ లేని సినిమా ఏంటంటూ థియేటర్స్ నుంచి బయటికి వస్తూ ఆడియన్స్ తిట్టుకున్నారు.
సూపర్ మచ్చి సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై సోదిలో లేకుండా పోయింది. పైగా మెగా హీరోలెవరు ఈ సినిమాను కనీసం ప్రమోట్ కూడా చేయలేదు.
దిల్ రాజు నిర్మాణంలో ఆయన వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న సినిమా రౌడీ బాయ్స్. శ్రీహర్ష ఈ సినిమా దర్శకుడు. ఇది కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14 విడుదలైంది. ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేకపోయింది.
మహేష్ బాబు మేనల్లుడు, నాయకుడు గల్ల జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా హీరో. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 15న విడుదలైంది. టాక్ బాగున్న అందుకు తగ్గట్టు వసూళ్లను సాధించలేకపోయింది.
మహానటి కీర్తి సురేష్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ మూవీ జనవరి 28న విడుదలైంది. ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేదు. బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది
నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన సినిమా బంగార్రాజు. జవవరి 14న విడుదలైన ఈ సినిమా 2022లో తొలి హిట్‌గా నిలిచింది. మొత్తంగా తొలి బ్రేక్ ఈవెన్ అందుకోని తెలుగులోనే కాదు.. మొత్తం దేశంలోనే తొలి హిట్ చిత్రంగా రికార్డులకు ఎక్కింది
ప్రియమణి హీరోయిన్‌గా ఆహాలో డైరెక్ట్ స్ట్రీమింగ్ అయిన సినిమా భామా కలాపం. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 11న విడుదలైంది ఈ చిత్రం.
సుమంత్ హీరోగా విడాకుల తర్వాత జీవితం అనే కాన్సెప్టుతో వచ్చిన సినిమా మళ్లీ మొదలైంది. ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 11న నేరుగా జీ5లో విడుదలైంది.
రవితేజ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కించిన సినిమా ఖిలాడి, ఫిబ్రవరి 11న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజే నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్స్ ఊహించినంతగా రాలేదు. బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది
హర్ష్ కనుమల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా జ్ఞానేశ్వర్ ద్వారక తెరకెక్కించిన సినిమా సెహరి. ఫిబ్రవరి 11న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
డిజే టిల్లు పెద్దగా సందడి లేకుండా వచ్చిన టిల్లు భాయ్ మంచి లాభాలు తీసుకొచ్చాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఫిబ్రవరిలో మొదటి హిట్ స్టేటస్‌ను దాటి ‘బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
లెక్షన్ కింగ్ హీరోగా డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం సన్ ఆఫ్ ఇండియా. ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తొలిరోజే డిజాస్టర్ టాక్ రావడంతో కలెక్షన్స్ అస్సలు రాలేదు.
పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే చంద్ర తెరకెక్కించిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదలైంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ చిత్రం మొదటి 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్.. 70 కోట్ల షేర్ వసూలు చేసింది. ఫిబ్రవరిలో విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా భీమ్లా నాయక్ రికార్డులు తిరగరాసింది.
ఆడవాళ్లు మీకు జోహార్లు మార్చ్ 4న విడుదలైంది. బయ్యర్స్‌కు రూ. 8 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చి మార్చి నెలలో తొలి ఫ్లాప్‌గా నిలిచింది.
ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా సెబాస్టియన్ పిసి 524. ఇది కూడా మార్చ్ 4నే విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
సూర్య హీరోగా ఈటీ (ఎవరికీ తలవంచకు) ఈ చిత్రం మార్చ్ 10న విడుదలైంది. . పాండిరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది.
రాధే శ్యామ్ మార్చ్ 11న విడుదలైంది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 120 కోట్లు నస్టాలతో మన దేశంలోనే 2022 బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.
స్టాండప్ రాహుల్.. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా సోదిలో లేకుండా పోయింది. ఈ సినిమా విడుదలైన విషయం కూడా చాలా మందికి తెలియదు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆకాశమే హద్దుగా రూ. 235 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ప్రపంచ రికార్డు సాధించింది. ఈ సినిమా రూ. 1200 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రూ. 601 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.
బాలీవుడ్‌లో పుల్ బిజీ అయిన తర్వాత తాప్సీ తెలుగులో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లో ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అసలు ప్రభావం చూపించలేకపోయింది.
ఏప్రిల్ 8న వరుణ్ తేజ్ ‘గని’తో మూవీ విడుదలైంది. రూ. 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. మొత్తంగా రూ. 5 కోట్ల షేర్ రాబట్టి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.
కెజియఫ్ ఛాప్టర్ 2 ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. అంతేకాదు రూ. 1000 కోట్ల క్లబ్బులో చేరిన మూడో సౌత్ సినిమాగా నిలిచింది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక నెల గ్యాప్‌లో రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. ఈ సినిమా ఇప్పటి వరకు 1212 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఆచార్యలో నటించారు. ఈ చిత్రం ఎప్రిల్ 29న విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది..
శ్రీ విష్ణు హీరోగా నటించి సినిమా ‘భళా తందనాన’. మే 8న థియేటర్స్‌లో విడుదలైన సినిమా ఫ్లాప్‌గా నిలిచింది.
విశ్వక్‌సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఈ చిత్రం 6న విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నా.. అందుకు తగ్గ వసూళ్లను రాబట్టలేక పోయింది.
మే 12న విడుదలైన మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ వసూళ్ల మోత మోగిచింది. ప్రాంతీయ సినిమాగా విడుదలై, ఓవర్సీస్‌లోనూ ఘన విజయం అందుకుంది.
వివాదాల మధ్య విడుదలైన చిత్రం ‘శేఖర్’. రాజశేఖర్ హీరోగా రూపొందిన ఈ సినిమా మే 20న విడుదలై, కొన్ని రోజుల్లోనే నిలిచిపోయింది
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘F3’.ఈ సినిమా మే 27న విడుదలై అబౌ యావరేజ్‌గా నిలిచింది.
విక్రమ్ తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్ల షేర్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా నాలుగు రోజుల్లో లాభాల్లోకి వచ్చింది. తెలుగులో రూ. 12.53 కోట్ల షేర్ రాబట్టింది. బయ్యర్స్‌కు రూ. 5 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. ఓవరాల్‌గా రూ. 138 కోట్ల షేర్ (రూ. 273 కోట్ల గ్రాస్ ) వసూళ్లను సాధించింది.
మేజర్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్లకు అమ్మారు. ప్రపంచ వ్యాప్తంగా అదనంగా రూ. 5 కోట్లు కలిపి రూ. 18 కోట్లకు అమ్ముడుపోయింది. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన మేజర్ మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 27.76 కోట్ల షేర్ ( రూ. 50.30 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా రూ.9 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చింది.
నాని హీరోగా నటించిన మూవీ ‘అంటే సుందరానికీ’ జూన్ 10న విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అభిమానులను అంచనాలను అందుకోలేకపోయింది
సత్యదేవ్ హీరోగా నటించిన మూవీ ‘గాడ్సే’ . ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర మరో డిజాస్టర్‌గా నిలిచింది.
జూన్ 17న విడుదలైన రానా, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ విరాట పర్వం. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమై బాక్పాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications