లయన్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలక్రిష్ణా, త్రిష, రాధిక అప్తె తదితరులు ముఖ్య పాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సత్యదేవ్ నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత రుద్రపాటి రమణ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చుతున్నారు.
కథ
ముంబైలోని మనోహర్ హాస్పటిల్ లో ...కోమాలో ఉన్న గాడ్సే(బాలకృష్ణ) ఒకరోజు లేచి కూర్చుంటాడు. చాలా కాలం తర్వాత స్పృహలోకి వచ్చిన గాడ్సే...తన పేరు బోస్ అని గాడ్సే కాదని చెప్తూడు. అంతేకాక అక్కడకి వచ్చిన తల్లితండ్రులు(చంద్రమోహన్, జయసుధ)లను, భార్య (రాధికా ఆప్టే)ని గుర్తుపట్టక...వాళ్లు అసలు తన వాళ్ళే కాదని పొమ్మంటాడు. అంతటితో సరిపెట్టక..సరయు(త్రిష) రోడ్డు మీద కనపడితే..ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అని వెనకపడతాడు . ఓ ఇంటికి వెళ్లి అది తన ఇల్లే అంటాడు. అక్కడున్న చలపతిరావు, గీతలను తన తల్లితండ్రులు అంటాడు. ఇంతకీ గాడ్సే ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు. అదేమన్నా హెల్త్ ప్లాబ్లమా..లేక అతను చెప్పేది నిజమేనా... ఇంతకీ ..అతను చెప్పే బోస్ ఎవరు...ముఖ్యమంత్రి (ప్రకాష్ రాజ్) కు గాడ్సేకు వైరం ఏమిటి... బోస్, గాడ్సే వేరు వేరా..ఒకరేనా అనే విషయాలు తెలుసుకోవాలంటే ...సినిమా చూడాల్సిందే.