X
లోఫర్
Action | Romance | 17 Dec 2015 | U/A |
Telugu

లోఫర్ స్టోరీ

లోఫర్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ తేజ్, దిశా పటాని, బ్రహ్మానందం, రేవతి మీనణ్, పోసాని క్రిష్ణా మురళి, ముకేష్‌ రుషి, సంపూర్ణేష్‌ బాబు, సప్తగిరి, పవిత్ర లోకేష్‌, ఉత్తేజ్‌, భద్రమ్‌, శాండీ, ధనరాజ్‌, టార్జాన్‌, చరణ్‌దీప్‌, వంశీ, రమ్య తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరి జగన్నాధ్ నిర్వహించారు మరియు నిర్మాత సి కళ్యాన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సునీల్‌ కశ్యప్‌ స్వరాలు సమకుర్చురు.

కథ

లోఫర్ పనులు, దొంగతనాలు చేసే కృష్ణ (పోసాని కృష్ణమురళి) భార్య లక్ష్మమ్మ (రేవతి)తో పుట్టింటి నుండి ఆస్తి తేవాలని గొడవ పడతాడు. లక్ష్మమ్మ అందుకు ఒప్పుకోక పోవడంతో నెలల వయసున్న తనకొడుకు రాజా (వరుణ్‌తేజ్‌)ని కూడా తీసుకుని జోద్ పూర్ వచ్చేస్తాడు. ‘నీ చిన్నప్పుడే అమ్మ పచ్చ కామెర్లొచ్చి చచ్చిపోయింది' అంటూ నమ్మిస్తాడు. కొడుకును తనంటే లోఫర్ గా, దొంగగా పెంచి పెద్దచేస్తాడు. ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో ఇంట్లోంచి పారిపోయి జోథ్‌పూర్‌ వస్తుంది పారిజాతం (దిశాపటాని). ఆమెను తొలి చూపులోనే ప్రేమిస్తాడు రాజా. ఈ క్రమంలో పారిజాతం సొంత మరదలేనని, ఆమె తన సొంత మేనమామ (ముఖేష్‌రుషి) కూతురేనని, తన అమ్మ బతికే ఉందన్న నిజం పారిజాతం ద్వారా తెలుసుకొంటాడు రాజా. ఈలోగా తన మామ మనసుషులు పారిజాతాన్ని ఎత్తుకెళ్లి బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తారు. తర్వాత ఏం జరిగింది? రాజా తన మరదలిని ఎలా దక్కించుకున్నాడు? అమ్మకు ఎలా దగ్గరయ్యాడు అనేది తెరపై చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+