twitter

    లవ్ స్టోరి స్టోరి

    లవ్ స్టోరి  సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, ఉత్తేజ్, దేవయాని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శేఖర్ కమ్ముల వహించారు. నిర్మాత నారాయణ దాస్ నిర్మించారు. ఈ సినిమాకి దర్శకత్వం సి ఎచ్ పవన్ అందించారు. 

    కథ 
    ఆర్మూర్‌కు చెందిన రేవంత్ (నాగచైతన్య) తక్కువ కులానికి చెందిన వాడు. అదే ఊరుకు చెందిన మౌనిక (సాయి పల్లవి) ఉన్నత కులానికి చెందిన వారు. వివక్షను తట్టుకోలేక పట్టణానికి వెళ్లి డ్యాన్స్ స్కూల్ రేవంత్ నడుపుతుంటాడు. తన బాబాయ్‌ (రాజీవ్ కనకాల)తో ఉన్న సమస్య నుంచి తప్పించుకోవడానికి మౌనిక హైదరాబాద్‌కు చేరుతుంది. అక్కడే జరిగిన రేవంత్, మౌనిక పరిచయం ప్రేమ వరకు సాగుతుంది. పెళ్లికి కులమతాలు అడ్డుగోడలుగా నిలుస్తాయి. చిన్నతనంలో రేవంత్‌ ఎలాంటి వివక్షను అనుభవించాడు? ఆ వివక్ష వల్ల సమాజంపై రేవంత్‌కు ఎలాంటి అభిప్రాయం కలిగింది. మౌనిక‌కు బాబాయ్‌తో ఉన్న సమస్య ఏమిటి? కులమతాల అడ్డుగోడలను పడగొట్టేందుకు రేవంత్, మౌనిక ఎలాంటి నిర్ణయం తీసుకొన్నారు? పెళ్లి చేసుకొని దుబాయ్‌కి పారిపోవాలని ప్రయత్నించిన మౌనిక తన మనసును ఎందుకు మార్చుకొన్నది? అకృత్యాలకు పాల్పడిన బాబాయ్‌కి ఎలాంటి గుణాపాఠం నేర్పేందుకు మౌనిక, రేవంత్ ప్రయత్నించారు. చివరికి బాబాయ్‌కి ఎలాంటి శిక్షను అనుభవించారనే ప్రశ్నలకు సమాధానమే లవ్ స్టోరి సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie లవ్ స్టోరి with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X