X
లవ్ యు రామ్
Drama | 30 Jun 2023 | U | 118 Mins
Telugu

లవ్ యు రామ్ స్టోరీ

లవ్ యు రామ్ సినిమా డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రోహిత్ బెహల్, అపర్ణ జనార్దన్, శ్రవంతి వీసం, బెనర్జీ, కాదంబరి కిరణ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం డివై చౌదరి దర్శకత్వం వహించారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి నిర్మించారు. సంగీతం కె వేద అందించారు. 

కథ
నార్వేలో హోటల్ బిజినెస్ నిర్వహించే రామ్ (రోహిత్ బెహల్) ఇండియాకు వచ్చి పెళ్లి కోసం అమ్మాయి వేట ప్రారంభిస్తాడు. నార్వేలో తన వ్యాపార వ్యహారాలు చూసుకొనే సీఈవో పూర్ణాచారి అలియాస్ పీసీకి ఆ బాధ్యతను అప్పగిస్తాడు. అయితే తాను చేసుకోబోయే అమ్మాయి తనకు భార్య కంటే తన కంపెనీలో మంచి ఉద్యోగిగా ఉండాలనే కండిషన్ పెడుతాడు. ఆ క్రమంలో బాల్య స్నేహితురాలు దివ్య (అపర్ణ జనార్ధన్)ను పెళ్లి చేసుకొంటాడు. శోభనానికి ముందు రామ్ కమర్షియల్ ఆలోచన దివ్యకు తెలుస్తుంది. రామ్ కమర్షియల్ మెంటాలిటీ వల్ల సీఈవో పీసీకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? రామ్ వ్యాపార ధోరణి పీసీకి ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి భార్య కంటే మంచి ఉద్యోగి కావాలని రామ్ కోరుకొన్నప్పుడు పీసీ రియాక్షన్ ఏమిటి? రామ్ ప్లాన్ తెలిసిన తర్వాత దివ్య ఎలా రియాక్ట్ అయింది? భార్య కంటే ఉద్యోగి కావాలనుకొన్న రామ్‌ ఆలోచనకు దివ్య ఆమోదం తెలిపిందా? రామ్ ప్లాన్‌ తెలిసిన తర్వాత దివ్య ఏం చేసింది? అనే ప్రశ్నలకు సమాధానమే లవ్ యు రామ్.

రిలీజ్ 
ఈ సినిమాను జూన్ 30న రిలీజ్ అయ్యింది. 

ట్రైలర్ 
పెళ్లి విషయంలో అమ్మాయి అభిప్రాయం, అబ్బాయి సిద్ధాంతం రెండూ వేరు. ఎవరినైనా నమ్మించడమే జీవితమనేది అబ్బాయి పద్దతి.. జీవితాన్ని ప్రేమించడమే అమ్మాయి తీరు.. అలాంటి వేరు వేరు అభిప్రాయాలు ఉన్న ఇద్దరి మధ్య నడిచే కథనే లవ్ యూ రామ్. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ లోనూ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చివరగా నమ్మించడం కష్టం.. ప్రేమించడం ఈజీ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+