X
తెలుగు » సినిమాలు » లవ్ యు రామ్
లవ్ యు రామ్

లవ్ యు రామ్

Drama | 30 Jun 2023 | U | 118 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

లవ్ యు రామ్ స్టోరీ

లవ్ యు రామ్ సినిమా డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రోహిత్ బెహల్, అపర్ణ జనార్దన్, శ్రవంతి వీసం, బెనర్జీ, కాదంబరి కిరణ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం డివై చౌదరి దర్శకత్వం వహించారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి నిర్మించారు. సంగీతం కె వేద అందించారు.  కథ నార్వేలో హోటల్ బిజినెస్ నిర్వహించే రామ్ (రోహిత్ బెహల్) ఇండియాకు వచ్చి పెళ్లి కోసం అమ్మాయి వేట ప్రారంభిస్తాడు. నార్వేలో తన వ్యాపార వ్యహారాలు చూసుకొనే సీఈవో పూర్ణాచారి అలియాస్ పీసీకి ఆ బాధ్యతను అప్పగిస్తాడు. అయితే తాను చేసుకోబోయే అమ్మాయి తనకు భార్య కంటే తన కంపెనీలో మంచి ఉద్యోగిగా ఉండాలనే కండిషన్ పెడుతాడు. ఆ క్రమంలో బాల్య స్నేహితురాలు దివ్య (అపర్ణ జనార్ధన్)ను పెళ్లి చేసుకొంటాడు. శోభనానికి ముందు రామ్ కమర్షియల్ ఆలోచన దివ్యకు తెలుస్తుంది. రామ్ కమర్షియల్ మెంటాలిటీ వల్ల సీఈవో పీసీకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? రామ్ వ్యాపార ధోరణి పీసీకి ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి భార్య కంటే మంచి ఉద్యోగి కావాలని రామ్ కోరుకొన్నప్పుడు పీసీ రియాక్షన్ ఏమిటి? రామ్ ప్లాన్ తెలిసిన తర్వాత దివ్య ఎలా రియాక్ట్ అయింది? భార్య కంటే ఉద్యోగి కావాలనుకొన్న రామ్‌ ఆలోచనకు దివ్య ఆమోదం తెలిపిందా? రామ్ ప్లాన్‌ తెలిసిన తర్వాత దివ్య ఏం చేసింది? అనే ప్రశ్నలకు సమాధానమే లవ్ యు రామ్. రిలీజ్   ఈ సినిమాను జూన్ 30న రిలీజ్  అయ్యింది.  ట్రైలర్  పెళ్లి విషయంలో అమ్మాయి అభిప్రాయం, అబ్బాయి సిద్ధాంతం రెండూ వేరు. ఎవరినైనా నమ్మించడమే జీవితమనేది అబ్బాయి పద్దతి.. జీవితాన్ని ప్రేమించడమే అమ్మాయి తీరు.. అలాంటి వేరు వేరు అభిప్రాయాలు ఉన్న ఇద్దరి మధ్య నడిచే కథనే లవ్ యూ రామ్. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ లోనూ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చివరగా నమ్మించడం కష్టం.. ప్రేమించడం ఈజీ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.
Read More

లవ్ యు రామ్ కాస్ట్ & క్రూ

లవ్ యు రామ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం డివై చౌదరి
సినిమాటోగ్రఫీ సాయి సంతోష్
సంపాదకుడు NA
సంగీతం కె వేద
నిర్మాత డివై చౌదరి, కె దశరధ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లవ్ యు రామ్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఊహ తెలిసినప్పటి నుంచి ప్రేమించిన ఓ అమ్మాయి, భార్య అంటే తన వ్యాపారాన్ని చూసుకొనే ఉద్యోగి అనే అభిప్రాయం ఉన్న అబ్బాయి మధ్య జరిగే మానసిక సంఘర్షణ లవ్ యు రామ్. మంచి పాయింట్.. మరింత ఎఫెక్టివ్‌గా చెప్పడానికి స్కోప్ ఉంది. ఈ కథలో ఇంకా ఎమోషన్స్ పండించడానికి పాత్రలు రెడీగా ఉన్నాయనిపిస్తుంది. అయితే దర్శకుడు పూర్తిస్థాయిలో ఇంకా కొంత వర్క్ చేసి ఉంటే క్లాసికల్ లవ్ స్టోరి అయి ఉండేది. సెన్సిటివ్, సెన్సిబుల్ లవ్ స్టోరీలను ఆదరించే వారికి లవ్ యూ రామ్ నచ్చుతుంది.

లవ్ యు రామ్ ట్రైలర్

Video Thumbnail

లవ్ యు రామ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లవ్ యు రామ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+