మా అబ్బాయి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీ విష్ణు, చిత్ర శుక్ల తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కుమార్ వట్టి వహించాడు మరియు వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై బేబి సక్షి సమర్పణలో బెలగ ప్రకాష్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సురేష్ బొబ్బిలి స్వరాలు సమకుర్చరు.
కథ
కాశీ విశ్వనాథ్, సనా దంపతులకు ఓ అబ్బాయి (శ్రీ విష్ణు) ఓ అమ్మాయి. వీరిది అన్యోన్యమైన కుటుంబం. శ్రీ విష్ణు చెల్లెలికి పెళ్లి కుదరడంతో పెళ్లి బట్టలు, ఇతర వస్తువులు కొనేందుకు షాపింగ్‌కు వెళ్లారు. షాపింగ్ నుంచి తిరిగి వస్తూ సాయిబాబా గుడికి వెళ్తారు. అక్కడ జరిగిన బాంబు పేలుళ్లలో హీరో శ్రీ విష్ణు కుటుంబ సభ్యులందరూ మృత్యువాత పడుతారు. బాంబు పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిద్దీన్ కుట్ర ఉందని హీరోకు తెలుస్తుంది. తన తల్లి, తండ్రి, చెల్లి ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు మట్టుబెట్టేందుకు శ్రీ విష్ణు నిర్ణయించుకొంటాడు. ఈ క్రమంలో ఎదురింట్లో ఉండే ఓ అమ్మాయి (చిత్ర శుక్ల) తో శ్రీ విష్ణు ప్రేమలో పడుతాడు. హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తూనే హంతకుల వేట కొనసాగిస్తుంటాడు. చివరికి సాయిబాబా ఆలయంలో జరిగిన మారణహోమానికి కారణమైన వారెవరు అనేది తెలుసుకోవడంలో హీరో సఫలమయ్యాడా? వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు అనేది ఈ చిత్ర కథ.