మారన్ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధనుష్, మాళవిక మోహనన్, శృతి వెంకట్, సముద్రఖని, మహేంద్రన్, కృష్ణకుమార్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కార్తీక్ నరేన్ వహించారు. నిర్మాతలు అర్జున్ త్యాగరాజన్, సెంథిల్ త్యాగరాజన్ కలిసి నిర్మించారు. సంగీతం జి వి ప్రకాష్ కుమార్ అందించారు.
కథ
చిన్నప్పుడే నిజాయితీగల జర్నలిస్ట్ అయిన తండ్రి(రాంకీ) చావు కళ్లారా చూసిన మారన్ ( ధనుష్) తాను కూడా ఒక నిజాయితీ గల జర్నలిస్ట్ గా మారతాడు. కష్టపడి ఓ చోట ఉద్యోగం సంపాదించి హ్యాపీగా గడిచిపోతుంది అని అనుకుంటున్న తరుణంలో తన స్నేహితుడైన ఒక ఎస్సై ప్రోద్బలంతో ఒక స్టింగ్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ స్టింగ్ ఆపరేషన్ లో పళని (సముద్రఖని) అనే ఒక మాజీ మంత్రి ఎన్నికల విషయంలో ఈవీఎం ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనే విషయం తెలుస్తుంది.. ఈ విషయం బయటపెట్టిన మారన్ మీద కొంతమంది ఆగంతుకులు ఎటాక్ చేస్తారు. అనుకోని పరిస్థితుల్లో మారన్ చెల్లి అతని కళ్ళ ముందే చనిపోతుంది. అయితే ఆమె పోస్టుమార్టం చనిపోలేదని విషయం అర్థం చేసుకున్న మాత్రం తన చెల్లిని ఎలా కాపాడుకో గలిగాడు ? అతని లైఫ్ లో తార (మాళవికా మోహనన్) పాత్ర ఏమిటి?.చెల్లిని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా మొదలైన నాటి నుంచి ఎక్కడో చూసిన సీన్లు చూస్తున్నామని భావన కలుగుతుంది. ఎందుకంటే సినిమాలో తర్వాత ఏం జరగబోతోంది? అనే విషయం ఈజీగా అర్థం అయిపోతుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉన్నాయి, బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ఉంది, ఇన్వెస్టిగేటివ్ స్టోరీ కూడా ఉంది. కానీ ఈ సినిమా చూస్తుంటే తర్వాత జరిగే విషయం ఏమిటి అని చాలా సులభంగా ఊహిస్తారు. సినిమా మొత్తానికి కీలకమైన విషయం ఏదైనా ఉందా? అంటే అది కేవలం సినిమా చివరిలో ఉన్న ట్విస్ట్. ఈ ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంది. కేవలం ఈ ఒక్క ట్విస్ట్ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు.