X
మడతకాజా
Comedy | Romance | 30 Sep 2011 | U/A |
Telugu

మడతకాజా స్టోరీ

మడతకాజా  సినిమా కామిడి రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, స్నేహా ఉల్లాల్, సుబ్బరాజు, జయప్రకాశ్, ఆహుతి ప్రసాద్, ఆశిశ్ విద్యార్థి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చలపతిరావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సీతారామరాజు దంతులూరి నిర్వహించారు మరియు నిర్మాత వేదంరాజు టింబర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీవసంత్ స్వరాలు సమకుర్చారు.

కథ

కళ్యాణ్ (అల్లరి నరేష్) వైజాగ్ లో పోలీస్ ఇన్ఫార్మర్ గా చేస్తూంటాడు. కళ్యాణ్ కి కండబలం లేదు,గుండె బలం లేదు. ఉన్నదంతా బుద్ది బలమే. మాటలలో మడతపెట్టేస్తూంటాడు.అలా మాటలతో బ్రతికేస్తున్న అతను స్నేహ(స్నేహ ఉల్లాల్) తో ప్రేమలో పడతాడు. ఆమె కెపి(ఆహుతి ప్రసాద్) అనే డాన్ కూతురు. తన తెలివి తేటలతో తన ప్రెండ్స్ (వెన్నెల కిషోర్, ధర్మవరపు)లతో ఆ అమ్మాయే వచ్చి ఐలవ్ యు చెప్పేలా చేయించుకుంటాడు. ఆ అమ్మాయిని కూడా మడతెట్టేశాక అస్సలు మడత మొదలవుతుంది. ఇంటర్నేషనల్ డాన్ నందా(ఆశిష్ విధ్యార్ధి) బ్యాంకాక్ లో ఉండి హైదరాబాద్ లో ఇల్లిగల్ బిజినెస్ నడుపుతూంటాడు. అతని హైదరాబాద్ ఆపరేషన్స్ ని స్నేహ తండ్రి కెపీ, జెపి(జయప్రకాష్ రెడ్డి) చూస్తూంటారు. వారిద్దరూ ఎప్పుడూ కొట్టుకుంటూ డాన్ దందాని పాడు చేస్తూంటారు. దాంతో నందా కి ఓ ఐడియా వస్తుంది. జెపి కొడుకు సుబ్బరాజుని ..కెపీ కూతురు స్నేహకి ఇస్తే సమస్య సమిసి పోతుందని..మరో ప్రక్క కళ్యాణ్ కి ఆ డాన్ పని చూడమని పై నుంచి ఆర్డర్స్. తన డ్యూటిని చేసుకుంటూ కళ్యాణ్ ఆ డాన్ ని ఎట్లా బుద్ది చెప్పి, తన లవర్ ని తన దాన్ని చేసుకున్నాడనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+