X
మళ్ళీ పెళ్ళి
Telugu

మళ్ళీ పెళ్ళి స్టోరీ

మళ్ళీ పెళ్ళి  సినిమా కామెడీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నరేష్, పవిత్ర లోకేష్, శరత్ బాబు, జయసుధ, అనన్య నాగళ్ళ, అన్నపూర్ణ, భద్రం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎమ్ ఎస్ రాజు వహించారు. నరేష్ నిర్మించారు. 

 

కథ

వైవాహిక జీవితంలో చోటుచేసుకొన్న సమస్యలతో బాధపడే తెలుగు నటుడు నరేంద్ర (వీకే నరేష్) అసంతృప్తితో లైఫ్‌ను లీడ్ చేస్తుంటాడు. వేల కోట్ల ఆస్తులు ఉన్న ఆయన జీవితంలో ప్రశాంతత కోసం వెతుకుతుంటాడు. ఆ క్రమంలో కన్నడ నటి పార్వతి (పవిత్ర లోకేష్) తో జరిగిన పరిచయం నరేంద్రకు జీవితంపై ఆశలు చిగురిస్తాయి. పార్వతితో రిలేషన్‌ బయటపడిన తర్వాత నరేంద్రను ఆయన భార్య సౌమ్య సేతుపతి (వనితా విజయ్ కుమార్) టార్గెట్ చేస్తుంది. నరేంద్ర, సౌమ్య మధ్య అఫైర్ ఎలా మొదలైంది? వారిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి? పెళ్లి తర్వాత నరేంద్రకు, రమ్యకు ఎలాంటి విభేదాలు తలెత్తాయి? పార్వతితో నరేంద్ర పరిచయం ప్రేమగా ఎలా మారింది? పార్వతి దాంపత్య జీవితంలో చోటు చేసుకొన్న చేదు సంఘటనలు ఏమిటి? పార్వతి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకొన్నది? చనిపోవాలని నిర్ణయించుకొన్న పార్వతికి నరేంద్ర ఎలా అండగా నిలిచాడు. పార్వతి, నరేంద్ర బంధానికి సౌమ్య ఎలా అడ్డుగోడలా నిలువాలని ప్రయత్నించింది అనే ప్రశ్నలకు సమాధానమే మళ్లీ పెళ్లి సినిమా.  


ట్రైలర్ 
ట్రైలర్‌లో నరేంద్రగా నరేశ్‌, పార్వతిగా పవిత్రా లోకేశ్‌ కనిపించారు. రెండో భార్య పాత్రలో వనితా విజయ్‌ కుమార్‌ కనిపించారు. సీనియర్‌ నటి అన్నపూర్ణ తనదైన డైలాగులతో అలరించారు. మొత్తానికి ఈ ట్రైలర్‌ ద్వారా నరేశ్‌ తన రియల్‌ లైఫ్‌ స్టోరీని సినిమాగా తీస్తున్నాడని ఇట్టే అర్థమైపోతుంది.నరేష్, పవిత్రా లోకేష్ పరిచయం ప్రేమగా ఎలా మారింది? టాపిక్ నుంచి 'మా' ఎలక్షన్స్, బెంగళూరు ఎపిసోడ్ & మూడో భార్యను ఆయన కాలి మీద తన్నడం వరకు 'మళ్ళీ పెళ్లి' ట్రైలర్లో అన్నీ చూపించారు. 

 
రిలీజ్ 
మే 26న  తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసారు

స్టోరీ లైన్ 
నరేష్ జీవితంలో జరిగిన ఘటనలు, సంఘటనల సమాహారమే అని అర్థం అవుతోంది. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రా‍న్ని తెరకెక్కించారు. అయితే... సినిమాలో పేర్లు మార్చారు. నరేంద్రగా నరేష్, పార్వతిగా పవిత్రా లోకేష్ కనిపించారు. మూడో భార్య రమ్యా రఘుపతి పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+