X
తెలుగు » సినిమాలు » మళ్ళీ పెళ్ళి
మళ్ళీ పెళ్ళి

మళ్ళీ పెళ్ళి

Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

మళ్ళీ పెళ్ళి స్టోరీ

మళ్ళీ పెళ్ళి  సినిమా కామెడీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నరేష్, పవిత్ర లోకేష్, శరత్ బాబు, జయసుధ, అనన్య నాగళ్ళ, అన్నపూర్ణ, భద్రం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎమ్ ఎస్ రాజు వహించారు. నరేష్ నిర్మించారు.    కథ వైవాహిక జీవితంలో చోటుచేసుకొన్న సమస్యలతో బాధపడే తెలుగు నటుడు నరేంద్ర (వీకే నరేష్) అసంతృప్తితో లైఫ్‌ను లీడ్ చేస్తుంటాడు. వేల కోట్ల ఆస్తులు ఉన్న ఆయన జీవితంలో ప్రశాంతత కోసం వెతుకుతుంటాడు. ఆ క్రమంలో కన్నడ నటి పార్వతి (పవిత్ర లోకేష్) తో జరిగిన పరిచయం నరేంద్రకు జీవితంపై ఆశలు చిగురిస్తాయి. పార్వతితో రిలేషన్‌ బయటపడిన తర్వాత నరేంద్రను ఆయన భార్య సౌమ్య సేతుపతి (వనితా విజయ్ కుమార్) టార్గెట్ చేస్తుంది. నరేంద్ర, సౌమ్య మధ్య అఫైర్ ఎలా మొదలైంది? వారిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి? పెళ్లి తర్వాత నరేంద్రకు, రమ్యకు ఎలాంటి విభేదాలు తలెత్తాయి? పార్వతితో నరేంద్ర పరిచయం ప్రేమగా ఎలా మారింది? పార్వతి దాంపత్య జీవితంలో చోటు చేసుకొన్న చేదు సంఘటనలు ఏమిటి? పార్వతి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకొన్నది? చనిపోవాలని నిర్ణయించుకొన్న పార్వతికి నరేంద్ర ఎలా అండగా నిలిచాడు. పార్వతి, నరేంద్ర బంధానికి సౌమ్య ఎలా అడ్డుగోడలా నిలువాలని ప్రయత్నించింది అనే ప్రశ్నలకు సమాధానమే మళ్లీ పెళ్లి సినిమా.   ట్రైలర్  ట్రైలర్‌లో నరేంద్రగా నరేశ్‌, పార్వతిగా పవిత్రా లోకేశ్‌ కనిపించారు. రెండో భార్య పాత్రలో వనితా విజయ్‌ కుమార్‌ కనిపించారు. సీనియర్‌ నటి అన్నపూర్ణ తనదైన డైలాగులతో అలరించారు. మొత్తానికి ఈ ట్రైలర్‌ ద్వారా నరేశ్‌ తన రియల్‌ లైఫ్‌ స్టోరీని సినిమాగా తీస్తున్నాడని ఇట్టే అర్థమైపోతుంది.నరేష్, పవిత్రా లోకేష్ పరిచయం ప్రేమగా ఎలా మారింది? టాపిక్ నుంచి 'మా' ఎలక్షన్స్, బెంగళూరు ఎపిసోడ్ & మూడో భార్యను ఆయన కాలి మీద తన్నడం వరకు 'మళ్ళీ పెళ్లి' ట్రైలర్లో అన్నీ చూపించారు.    రిలీజ్  మే 26న  తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసారు స్టోరీ లైన్   నరేష్ జీవితంలో జరిగిన ఘటనలు, సంఘటనల సమాహారమే అని అర్థం అవుతోంది. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రా‍న్ని తెరకెక్కించారు. అయితే... సినిమాలో పేర్లు మార్చారు. నరేంద్రగా నరేష్, పార్వతిగా పవిత్రా లోకేష్ కనిపించారు. మూడో భార్య రమ్యా రఘుపతి పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించారు. 
Read More

మళ్ళీ పెళ్ళి కాస్ట్ & క్రూ

మళ్ళీ పెళ్ళి సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎమ్ ఎస్ రాజు
సినిమాటోగ్రఫీ బాల్ రెడ్డి
సంపాదకుడు జునైద్ సిద్దిక్యూ
సంగీతం సురేష్ బొబ్బిలి
నిర్మాత నరేష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మళ్ళీ పెళ్ళి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
లవ్, ఎమోషనల్, మ్యారేజ్ బ్రేకప్ లాంటి అంశాల కూర్పుతో రూపొందిన చిత్రం మళ్లీ పెళ్లి. పక్కాగా వీకే నరేష్, పవిత్ర లోకేష్ జీవితంలో బయటకు తెలిసిన విషయాల వెనుక ఉన్న కారణాలను చెప్పడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తుంది. ఈ కథలో వాస్తవం ఎంత? ఫిక్షన్ ఎంత? అనే విషయాలు దర్శకుడికి వదిలేస్తే.. మంచి ఎమోషనల్ కంటెంట్‌గా సినిమా కనిపిస్తుంది. ముఖ్యంగా మైసూర్ హోటల్‌లో నరేష్, పవిత్ర మీడియాకు దొరికిన ఎపిసోడ్ వెనుక వాస్తవాన్ని బలంగా చెప్పడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. ఆకర్షణగా మొదలైన అఫైర్‌ అనంతరం పార్వతితో నరేంద్ర ఎందుకు ఎమోషనల్ కనెక్ట్ అయ్యాడు? ఆమెకు ఎందుకు అండగా నిలువాలని ప్రయత్నించారనే పాయింట్ బాగుంది. ఎంఎస్ రాజు సినిమాను తెరకెక్కించిన విధానం.. వనితా విజయ్ కుమార్, నరేష్, పవిత్ర పెర్ఫార్మెన్స్ కోసం మళ్లీ పెళ్లి చూడవచ్చు. మంచి ఫన్‌తో పాటు ఎమోషన్స్ ఒక అనుభూతిని తప్పకుండా ఈ సినిమా పంచుతుంది.

మళ్ళీ పెళ్ళి ట్రైలర్

Video Thumbnail

మళ్ళీ పెళ్ళి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మళ్ళీ పెళ్ళి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+