మలుపు సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది పినిశట్టి, నిక్కి గల్రాని, మితున్ చక్రవర్తి, పశుపతి, రిచ పల్లోద్, నాజర్, అదుకలం నరెన్, ప్రగత్య, లక్ష్మి ప్రియ తదితరులు నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం సత్య ప్రభాస్ పణిశెట్టి నిర్వహించారు మరియు నిర్మాత రవింద్ర పనిశేట్టి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ప్రసన్ ప్రవీన్ శ్యామ్ స్వరాలు సమకుర్చరు.
కథ
సగ... పూర్తి పేరు సాయి గణేష్ (ఆది పినిశెట్టి ) హ్యాపీ గోయింగ్ మ్యాన్. తన బెస్ట్ ఫ్రెండ్స్ శివ ,రాజేష్ ,కిషోర్ లతో కలిసి హ్యాపీగా గడిపేస్తుంటాడు. ఓ సారి ఈ నలుగురూ కలిసి న్యూ ఇయర్ పార్టీకి వెళ్లి తాగిన మత్తులో ప్రియ (రిచా ), ఆమె బాయ్ ఫ్రెండ్ సూర్య (శ్రవణ్ )లతో గొడవ పడతారు. శ్రవణ్ ను తీవ్రంగా కొడతాడు. దీంతో ప్రియ తండ్రి, మాఫియా డాన్ అయిన మొదలియార్ (మిథున్ చక్రవర్తి ) సగ ఫ్రెండ్స్ ని చంపడానికి తిరుగుతుంటారు. ఈ విషయం తెలిసి నేరుగా మొదలియార్ ను కలిసి క్షమాపణ చెప్పాడానికి ముంబై వెళ్లిన సగకి వారు తమను చంపాలని తిరగడానికి కారణం వేరే అని తెలుస్తుంది. మొదలియార్ గ్యాంగ్ సగ అండ్ ఫ్రెండ్స్ ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? సగ తన ఫ్రెండ్స్ ను కాపాడుకోవడానికి ఏం చేసాడు? అనేది తెరపై చూడాల్సిందే.