మనం సినిమా కామిడి రోమ్యాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులొ అక్కినేని,నాగార్జున, చైతన్య , సమంత, శ్రెయ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే తదితరులు ప్రాధాన పాత్రాలలో నటించారు. ఈసినిమాకి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె కుమార్ నిర్వహించారు, నిర్మాత : నాగార్జున అక్కినేని నిర్మించారు. ఈచిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు.
చంద్రాబోస్ వనమాల
కథ
పెద్ద పారిశ్రామిక వేత్త నాగేశ్వరరావు(నాగార్జున) కి తల్లి తండ్రులు చిన్నప్పుడే చనిపోతారు. అయితే ఓ రోజు అనుకోకండా తన తల్లి(సమంత),తండ్రి (నాగచైతన్య) పోలికలు ఉన్న వాళ్లు తారసపడటంతో వారిని తన పేరెంట్స్ గానే భావించి ఆదరిస్తాడు. అంతేకాక విడివిడిగా వీరిద్దరని కలిపే ప్రయత్నం చేస్తాడు. ఇలాంటిదే మరో కథ సమాంతరంగా జరుగుతుంది. చైతన్య(నాగేశ్వరరావు) కూడా అదే విధంగా తన తల్లి తండ్రులను చిన్న తనంలో కోల్పోతాడు.
అయితే ఓ రోజు అనుకోని పరిస్ధితుల్లో తన తల్లి(శ్రియ),తండ్రి(నాగార్జున) పోలికలు ఉన్న వాళ్లు కనపడతారు. దాంతో వీరిని కలపాలనుకుంటారు. ఈ రెండు కథల్లో కామన్ గా ఉండే క్యారెక్టర్ నాగేశ్వరరావు(నాగార్జున). ఇలా ఎవరి ప్రయత్నాలు వాళ్లు సైలెంట్ గా చేస్తూంటారు. ఆ ప్రయత్నాల్లో వారు సఫలమయ్యారా లేదా అన్నది మిగతా కథ. సినిమాలో... అక్కినేని నాగేశ్వరరావుగారి పాత్ర పేరు చైతన్య, నాగార్జున పాత్ర పేరు నాగేశ్వరరావు, నాగ చైతన్య పాత్ర పేరు నాగార్జున.