మరో చరిత్ర సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ సందేశ్, అనిత, శ్రద్ధాదాస్, కోట శ్రీనివాసరావు, ప్రతాప్ పోతన్, ఊర్వశి, తలైవాసల్ విజయ్, జానకి, సబేష్, నరేష్, ఆదర్శ్, వేణు, వెంకీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, ఛాయా గ్రహణ, దర్శకత్వం: రవి యాదవ్ నిర్వహించారు మరియు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, లక్షణ్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకత్వం మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చారు.
కథ
'మరో చరిత్ర' చూసినవారందరికీ తెలుసున్న కథనే అమెరికా బ్యాక్ డ్రాప్ లో మళ్లీ చెప్పుకుంటే...మధ్యలో కాలేజీ చదువు ఆపిన బాలు(వరుణ్ సందేశ్)కి ప్రక్కింట్లో ఉన్న స్వప్న(అనిత) పరిచయమవుతుంది. ఎప్పుడూ సైకిల్ మీద చక్కర్లు కొట్టే ఆమెతో అతను వెంటనే ప్రేమలో పడిపోతాడు. ఆమె కూడా ఆలస్యమెందుకు అనుకుని డిటోగా ప్రేమిస్తున్నాను అనేస్తుంది. ఇక కొన్ని రెగ్యులర్ ప్రేమ సీన్లు లొకేషన్స్ మార్చుకుని వచ్చి పోయాక వాళ్ళింట్లో వారికి ఆ విషయం తెలుస్తుంది. ఇక ఇక్కడ మరో ట్విస్టు ఏమిటంటే...అనిత తల్లి(ఊర్వసి) కొద్దిగా నోరు ఎక్కువ. ఎప్పుడూ బాలు తండ్రి(ప్రతాప్ పోతన్) తగువు పెట్టుకుంటుంది. ఇలా ఇరు పక్షాలు వారికి ఈ ప్రేమ ఇష్టం లేని స్ధితిలో ఓ ఎగ్రిమెంట్ కి వస్తారు. పాత మరో చరిత్ర చూసి పెట్టినట్లుగా ఓ కండిషన్ పెట్టి వారి ప్రేమని విడతీస్తారు. ఏ కండిషన్ అది అంటే...ఈ ప్రేమికులిద్దరూ సంవత్సరం పాటు ఒకరినొకరు చూసుకోకూడదు. పలకరించుకోకూదు. అలా ఓ సంవత్సరం పాటు గడిపాక వారి ప్రేమ నిజమైనది అనిపిస్తే వారు పెద్దలు పెళ్ళి చేస్తారన్నమాట. ఇక ఈ ప్రేమికులిద్దరూ పెద్దల ప్రేమను గౌరవించి విడిపోతారు. తర్వాత సంవత్సరం పాటు ఎగ్రిమెంట్ లో చెప్పినట్లు విడిపోయి బ్రతుకుతారా...చివరకు ఒరిజనల్ మరో చరిత్రలో ఉన్నట్లు చనిపోతారా అన్నది తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ సినిమా చూడాల్సిందే.