X
తెలుగు » సినిమాలు » మరో చరిత్ర
మరో చరిత్ర

మరో చరిత్ర

Romance | 25 Mar 2010 |
Telugu

2.6 /5 Users

1 /5 Filmibeat

మరో చరిత్ర స్టోరీ

మరో చరిత్ర సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్‌ సందేశ్‌, అనిత, శ్రద్ధాదాస్‌ , కోట శ్రీనివాసరావు, ప్రతాప్‌ పోతన్‌, ఊర్వశి, తలైవాసల్‌ విజయ్‌, జానకి, సబేష్‌, నరేష్‌, ఆదర్శ్‌, వేణు, వెంకీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, ఛాయా గ్రహణ, దర్శకత్వం: రవి యాదవ్‌ నిర్వహించారు మరియు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, లక్షణ్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకత్వం మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చారు. కథ 'మరో చరిత్ర' చూసినవారందరికీ తెలుసున్న కథనే అమెరికా బ్యాక్ డ్రాప్ లో మళ్లీ చెప్పుకుంటే...మధ్యలో కాలేజీ చదువు ఆపిన బాలు(వరుణ్ సందేశ్)కి ప్రక్కింట్లో ఉన్న స్వప్న(అనిత) పరిచయమవుతుంది. ఎప్పుడూ సైకిల్ మీద చక్కర్లు కొట్టే ఆమెతో అతను వెంటనే ప్రేమలో పడిపోతాడు. ఆమె కూడా ఆలస్యమెందుకు అనుకుని డిటోగా ప్రేమిస్తున్నాను అనేస్తుంది. ఇక కొన్ని రెగ్యులర్ ప్రేమ సీన్లు లొకేషన్స్ మార్చుకుని వచ్చి పోయాక వాళ్ళింట్లో వారికి ఆ విషయం తెలుస్తుంది. ఇక ఇక్కడ మరో ట్విస్టు ఏమిటంటే...అనిత తల్లి(ఊర్వసి) కొద్దిగా నోరు ఎక్కువ. ఎప్పుడూ బాలు తండ్రి(ప్రతాప్ పోతన్) తగువు పెట్టుకుంటుంది. ఇలా ఇరు పక్షాలు వారికి ఈ ప్రేమ ఇష్టం లేని స్ధితిలో ఓ ఎగ్రిమెంట్ కి వస్తారు. పాత మరో చరిత్ర చూసి పెట్టినట్లుగా ఓ కండిషన్ పెట్టి వారి ప్రేమని విడతీస్తారు. ఏ కండిషన్ అది అంటే...ఈ ప్రేమికులిద్దరూ సంవత్సరం పాటు ఒకరినొకరు చూసుకోకూడదు. పలకరించుకోకూదు. అలా ఓ సంవత్సరం పాటు గడిపాక వారి ప్రేమ నిజమైనది అనిపిస్తే వారు పెద్దలు పెళ్ళి చేస్తారన్నమాట. ఇక ఈ ప్రేమికులిద్దరూ పెద్దల ప్రేమను గౌరవించి విడిపోతారు. తర్వాత సంవత్సరం పాటు ఎగ్రిమెంట్ లో చెప్పినట్లు విడిపోయి బ్రతుకుతారా...చివరకు ఒరిజనల్ మరో చరిత్రలో ఉన్నట్లు చనిపోతారా అన్నది తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ సినిమా చూడాల్సిందే.
Read More

మరో చరిత్ర కాస్ట్ & క్రూ

మరో చరిత్ర సిబ్బంది సమాచారం

దర్శకత్వం రవి యాదవ్‌
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మరో చరిత్ర విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
బాలచందర్ 'మరో చరిత్ర' రీమేక్ అననగానే అంచనాలు ఏ రేంజిలో ఉంటాయో, అనుమానాలు అదే స్ధాయిలో ఉంటాయన్నది నిజం. అయితే అంచనాలను ప్రక్కకు నెట్టి, అనుమానాలను నిజం చేస్తూ ఈ రీమేక్ ధియోటర్లో దిగింది. ఎక్కడా ప్రేక్షకుడుకి కనెక్టు కాకుండా చిత్రం తన మానాన తాను నడుచుకుంటూ సహన పరీక్ష పెట్టింది. అలాగే ఒరిజనల్ లో ఉన్న పాటలు (ఏ తీగ పూవువో..., భలే భలే మొగాడివోయ్..)రీమిక్స్ చేసినా వర్కవుట్ అయిందా అదీ లేదు. ఆ పాటలు విన్న వారికి ఇవి వెగటు తెప్పిస్తాయి. ఇక వరుణ్ సందేశ్, అనిత తమ పరిధిలో తాము నటించినా దర్శకత్వ లోపంతో కృత్రిమంగా డైలాగులు చెప్తున్న ఫీల్ కలిగించింది. అయితే ఇంత వినాశనంలోనూ కెమెరా ప్రతిభ మాత్రమే చాలా సీన్లలో అబ్బురమనిపించింది. ఈ చిత్రం చూస్తూంటే వర్మా కా షోలే (షోలే రీమేక్) చిత్రం గుర్తుకు వచ్చిదనటంలో అతిశయోక్తి లేదు.

మరో చరిత్ర సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

మరో చరిత్ర

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+