మరో ప్రస్థానం (2021)(U/A)
Release date
24 Sep 2021
genre
మరో ప్రస్థానం స్టోరి
మరో ప్రస్థానం సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తనీష్, ముస్కాన్ సేతి, కబీర్ దుహన్ సింగ్, రవి కలే, అమిత్ తివారి, రాజా రవీంద్ర తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జూనీ వహించారు. నీరంతా షైక్ జానీ బాషా నిర్మించారు. సంగీతం సునీల్ కశ్యప్ అందించారు.
కథ
మాఫియా కార్యక్రమాలు నిర్వహించే రాణే భాయ్ (కబీర్ సింగ్) ముఠాలో శివ (తనీష్) క్రిమినల్ కార్యకలాపాలు కొనసాగిస్తుంటాడు. డబ్బు కోసం ఎలాంటి దారుణానికి ఒడిగట్టడానికి సిద్దపడే తనీష్ జీవితంలోకి నైనీ (అర్చన ఖన్నా) ప్రవేశిస్తుంది. అయితే నైనీతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన సమయంలో ఆమె దారుణ హత్యకు గురవుతుంది. తన ప్రేయసి నైనీ మరణించిన తర్వాత శివ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? ఏ పరిస్థితుల్లో నైనీ హత్యకు గురైంది. నైనీ హత్య తర్వాత రాణే భాయ్ ముఠాపై తనీష్ పగ తీర్చుకోవాలని అనుకొన్నాడు? నైనీ హత్యకు కారణం ఏమిటి? చివరకు శివ జీవితానికి ఎలాంటి ముగింపు లభించింది. ఈ కథలో జర్నలిస్టు (భాను శ్రీ మెహ్రా) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మరో ప్రస్థానం సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie మరో ప్రస్థానం with us? Please send it to us ([email protected]).