మస్కా సినిమా డ్రామ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్,హన్సిక,షీలా,ముఖేష్ రుషి,ప్రదీప్ రావత్, తెలంగాణా శకుంతల,బ్రహ్మానందం,ఎమ్.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేస్వరరావు,సునీల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బి గోపాల్ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎమ్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు.
కథ
ప్రపంచంలో ఎవరినీ లక్ష్య పెట్టకుండా...లక్ష్యమంటూ(పనిలో పనిగా పెద్ద చదువు కూడా) లేకుండా తిరిగే క్రిష్(రామ్)కి గయ్యాలి వదిన(ఝాన్సీ) పోరు తట్టుకోలేని విధంగా ఉంటుంది. విసుగెత్తిన (మారదాం అనుకోడు) మన హీరో అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటాడు.అయితే అతను చదివు ఫ్లస్ టు ఫెయిల్ కి అంత సీన్ లేదు కాబట్టి..అమెరికా వెళ్ళబోయే ఓ అమ్మాయిని ప్రేమలో పడేస్తే ఆమె వెనుకే వెళ్ళిపోవచ్చుకదా అని ఓ ప్లాన్ గీస్తాడు. అలాంటి అమ్మాయికోసం(పాట పాడుకుంటూ) వెతుకుతూంటే మంజు(షీలా)తారసపడుతుంది. అయితే రెండు నెలల్లో అమెరికా చెక్కేసే ఆ చక్కని చుక్కకు తను పెళ్ళాడబోయే వాడిపై కొన్ని విచిత్రమైన అభిప్రాయాలు ఉంటాయి.వాటిల్లో ముఖ్యంగా ఆ కాబోయేకి లవర్..సిగెరెట్,మందు వంటి అలవాట్లు ఉండాలి(ఎందుకంటే తాను మాన్పించమని చెప్పటానికి),అలాగే అతను భగ్న ప్రేమికుడు అయ్యుడాలి..వగైరా..వగైరా. ఆమె అభిరుచులన్నీ దొంగచాటుగా తెలుసుకున్న క్రిష్ ఆమెకు మస్కా వేయటానికి నిర్ణయించుకుంటాడు. అందులో బాగంగా తనో అమర..భగ్న ప్రేమికుడుని అన్నట్లు బిల్డప్ ఇస్తూ..సిగెరెట్లు,మందు మొదలెడతాడు. అంతేగాక తనకు దొరికన ఓ ఫొటో లో అమ్మాయి(హన్సిక)ను చూపుతూ..తన మాజీ లవర్ అని అబధ్దమాడతాడు(ఇది అజిత్ వాలి సినిమా నుండి లిఫ్ట్ చేసిన ఎపిసోడ్). ఇవన్నీ నమ్మి సంతృప్తి చెంది ప్రేమలో పడిపోయిన మంజు తన లవ్ ప్రపోజల్ పెట్టడానికి రెడీ అవుతుంది. అయితే అప్పడే ఆ క్షణానే మన హీరో చూపిన ఫొటోలోని అమ్మాయి..హన్సిక ప్రత్యక్ష్యమవుతుంది. అప్పుడు క్రిష్ ఏం చెప్పి మేనేజ్ చేసాడు. ఇంతకీ హన్సిక ఎవరు..ఇలాంటి లవ్ స్టోరీలోకి పోస్టర్స్ లో చూపుతున్నట్లుగా యాక్షన్ ఎపిసోడ్స్,విలన్స్(ముఖేష్ రుషి,ప్రదీప్ రావత్) ఎలా ఎంటర్ అయ్యారు అనేది తెలియాలంటే...తెరపై చూడాల్సిందే.