బిగ్‌బాస్ సీజన్ ఎప్పుడు ప్రారంభమైనా.. మొట్టమొదటగా డిబేట్ మొదలయ్యేది వారికి చెల్లించే రెమ్యునరేషన్‌పైనే. హోస్ట్ అక్కినేని నాగార్జునకు నిర్వాహకులు ఎంత మొత్తాన్ని చెల్లిస్తున్నారు? కంటెస్టెంట్లకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనే డిబేట్స్, డిస్కషన్స్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై జోరుగా సాగుతుంటాయి. ఈ సారి కూడా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో రెమ్యునరేషన్ డిబేట్స్ పెద్ద ఎత్తున సర్కులేట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ 5వ సీజన్ లో ఎవరెవరు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకునేది ఇప్పుడు చూద్దాం.