X
మస్కా

మస్కా

Drama | 14 Jan 2009 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

మస్కా స్టోరీ

మస్కా  సినిమా డ్రామ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్,హన్సిక,షీలా, ముఖేష్ రుషి,ప్రదీప్ రావత్, తెలంగాణా శకుంతల,బ్రహ్మానందం,ఎమ్.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేస్వరరావు,సునీల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బి  గోపాల్ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎమ్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు. కథ ప్రపంచంలో ఎవరినీ లక్ష్య పెట్టకుండా...లక్ష్యమంటూ(పనిలో పనిగా పెద్ద చదువు కూడా) లేకుండా తిరిగే క్రిష్(రామ్)కి గయ్యాలి వదిన(ఝాన్సీ) పోరు తట్టుకోలేని విధంగా ఉంటుంది. విసుగెత్తిన (మారదాం అనుకోడు) మన హీరో అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటాడు.అయితే అతను చదివు ఫ్లస్ టు ఫెయిల్ కి అంత సీన్ లేదు కాబట్టి..అమెరికా వెళ్ళబోయే ఓ అమ్మాయిని ప్రేమలో పడేస్తే ఆమె వెనుకే వెళ్ళిపోవచ్చుకదా అని ఓ ప్లాన్ గీస్తాడు. అలాంటి అమ్మాయికోసం(పాట పాడుకుంటూ) వెతుకుతూంటే మంజు(షీలా)తారసపడుతుంది. అయితే రెండు నెలల్లో అమెరికా చెక్కేసే ఆ చక్కని చుక్కకు తను పెళ్ళాడబోయే వాడిపై కొన్ని విచిత్రమైన అభిప్రాయాలు ఉంటాయి.వాటిల్లో ముఖ్యంగా ఆ కాబోయేకి లవర్..సిగెరెట్,మందు వంటి అలవాట్లు ఉండాలి(ఎందుకంటే తాను మాన్పించమని చెప్పటానికి),అలాగే అతను భగ్న ప్రేమికుడు అయ్యుడాలి..వగైరా..వగైరా. ఆమె అభిరుచులన్నీ దొంగచాటుగా తెలుసుకున్న క్రిష్ ఆమెకు మస్కా వేయటానికి నిర్ణయించుకుంటాడు. అందులో బాగంగా తనో అమర..భగ్న ప్రేమికుడుని అన్నట్లు బిల్డప్ ఇస్తూ..సిగెరెట్లు,మందు మొదలెడతాడు. అంతేగాక తనకు దొరికన ఓ ఫొటో లో అమ్మాయి(హన్సిక)ను చూపుతూ..తన మాజీ లవర్ అని అబధ్దమాడతాడు(ఇది అజిత్ వాలి సినిమా నుండి లిఫ్ట్ చేసిన ఎపిసోడ్). ఇవన్నీ నమ్మి సంతృప్తి చెంది ప్రేమలో పడిపోయిన మంజు తన లవ్ ప్రపోజల్ పెట్టడానికి రెడీ అవుతుంది. అయితే అప్పడే ఆ క్షణానే మన హీరో చూపిన ఫొటోలోని అమ్మాయి..హన్సిక ప్రత్యక్ష్యమవుతుంది. అప్పుడు క్రిష్ ఏం చెప్పి మేనేజ్ చేసాడు. ఇంతకీ హన్సిక ఎవరు..ఇలాంటి లవ్ స్టోరీలోకి పోస్టర్స్ లో చూపుతున్నట్లుగా యాక్షన్ ఎపిసోడ్స్,విలన్స్(ముఖేష్ రుషి,ప్రదీప్ రావత్) ఎలా ఎంటర్ అయ్యారు అనేది తెలియాలంటే...తెరపై చూడాల్సిందే.
Read More

మస్కా కాస్ట్ & క్రూ

మస్కా సిబ్బంది సమాచారం

దర్శకత్వం బి గోపాల్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చక్రి
నిర్మాత ఎమ్ ఎస్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మస్కా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఏదైమైనా భారీఖర్చు,స్టార్స్ ,పబ్లిసిటీ.. ఓపినింగ్స్ తెప్పించి ప్రేక్షుకుడిని మస్కా కొట్టించగలిగినా ఎంత వరకూ నిలబెడతాయి అన్నది సందేహమే. సంక్రాంతి రాజుగా పేరుపడి ఎన్నో హిట్స్ ఇచ్చిన ఎమ్.ఎస్.రాజుగారు ఇట్లాంటి సినిమాలతో బ్యానర్ వాల్యూని మసక బరచటం నిరాశే. ఇక ఈ సినిమాను ఏ అల్లరి నరేష్ కామెడీ సినిమాలాగానే ఊహించుకుని వెళితే ఫరవాలేదనిపిస్తుంది. కాబట్టి ఆ కోణంలో ట్రై చేయగలిగే మీరూ..నిర్మాత సేవ్ అవుతారు.

మస్కా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మస్కా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+