మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)
మిడిల్ క్లాస్ మెలోడీస్ స్టోరి
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, చైతన్య గరికపాటి, దివ్య శ్రీపాద, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, ప్రేమ్ సాగర్, ప్రభావతి వర్మ తదితరులు నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వెనిగళ్ల ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా వినోద్ అనంతోజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంగీతం స్వీకర్ అగస్తి అందించారు.
కథ
రాఘవ (ఆనంద్ దేవరకొండ) తన తండ్రి (గోపరాజు రమణ), తల్లి (సురభి ప్రభావతి) నిర్వహించే హోటల్లో చేదోడువాదోడుగా ఉంటాడు. పల్లెలో హోటల్ వ్యాపారం గిట్టుబాటు కాకపోవడంతో గుంటూరు టౌన్లో మరో హోటల్‌ను తెరువాలనుకొంటాడు. హోటల్‌ను తెరువడానికి తన కుటుంబానికి చెందిన పొలాన్ని తాను ప్రేమించిన సంధ్య (వర్ష బొల్లమ్మ) తండ్రికి అమ్మేయడం, ఆ తర్వాత వెంటనే దానికి ధరకు రెక్కలు వస్తాయి. గుంటూరులో హోటల్ ప్రారంభించడానికి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? తాను ప్రేమించిన సంధ్యను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది? రాఘవ ప్రారంభించిన హోటల్ ఏ మేరకు కస్టమర్లను ఆకట్టుకొన్నది? హోటల్ వ్యాపారాన్ని గాడిలో పెట్టడానికి రాఘవ ఎలాంటి కష్టాలు పడ్డారు? తన కుటుంబానికి చెందిన పొలం వివాదం చివరకు ఏమైంది లాంటి ప్రశ్నలకు సమాధానమే మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్ర కథ.