మిర్చి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, అనుష్క, రిచా గంగోపాధ్యాయ, సంపత్, నాగినీడు, బ్రహ్మానందం, రఘుబాబు, రాజేష్, హేమ, శ్రీనివాసరెడ్డి, కాశీవిశ్వనాథ్, వినోద్ తదితరులు. ఈ సినిమాకి దర్శకత్వం: కొరటాల శివ నిర్వహించారు మరియు నిర్మాతలు: వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
ఇటలీలో ఆర్కిటెక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న జై (ప్రభాస్)... వీలైతే ప్రేమిద్దాం.. పోయేదేముంది డ్యూడ్ అనే మనస్తత్వం ఉన్న యువకుడు. అక్కడే చదువుకుంటున్న మానస (రిచా గంగోపాధ్యాయ) జై ఏటిట్యూడ్ నచ్చి ప్రేమలో పడుతుంది. అంతేగాక తమ ప్రేమకు అడ్డుగా నిలిచే తన ఫ్యాక్షన్ కుటుంబం గురించి జై కు వివరిస్తుంది. దాంతో... జై వెంటనే తట్టాబుట్టా సర్దుకుని... ఇండియా వచ్చేసి, ఆమె ఇంటిలో వాలిపోయి... ప్యాక్షన్ పగలతో రగిలిపోతున్న వారి కుటుంబాన్ని సంస్కరించే పనిలో అమాంతం పడిపోతాడు. ఆ క్రమంలో అతని గురించి ఓ నిజం ప్రేక్షకులకు తెలుస్తుంది. ఇంతకీ జై ఆ ఇంటికి వచ్చింది.. తన ప్రేమ కోసం కాదు.. మరొక పనిమీద అని.. ఇంతకీ ఆ పని ఏమిటి... ఇంతకీ జై ఎవరు...మరో హీరోయిన్ వెన్నెల (అనుష్క) లతో జైకి ఉన్న బంధమేమిటి? వాళ్లిద్దరిలో ఎవరిని ప్రేమించాడు? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.