మోసగాళ్ళు యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, రుహానీ సింగ్, వివా హర్ష, తనికెళ్ళ భరణి, రఘు బాబు, రవి వర్మ, రాజా రవీంద్ర, నాగి నీడు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జెఫ్రీ గి చిన్ వహించారు. మంచు విష్ణు నిర్మించారు. సంగీతం శ్యామ్ సి ఎస్ అందించారు.
కథ
అక్కా తమ్ముళైన అర్జున్ (మంచు విష్ణు), అను (కాజల్ అగర్వాల్) హైదరాబాద్‌లోని కాల్ సెంటర్‌లో పనిచేస్తుంటారు. ఆర్థిక సమస్యలతో అసంతృప్తిగా జీవితం సాగిస్తున్న వారిద్దరూ ఏదో విధంగా భారీగా డబ్బు సంపాదించి కష్టాలకు దూరంగా ఉండాలని కోరుకొంటారు. ఈ క్రమంలో ఐటీ ఇండస్ట్రీలో ఉండే లోపాలను ఆసరాగా చేసుకొని తమ బాస్ సందీప్ రెడ్డి (నవదీప్)తో కలిసి అమెరికాలో భారీ కుట్రకు తెర తీస్తారు. అర్జున్, అనుకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వారి కుటుంబం దుర్భరమైన జీవితాన్ని గడిపాల్సిన అవసరం ఏమి వచ్చింది. సందీప్ రెడ్డితో కలిసి చేసిన 300 మిలియన్ డాలర్ల కుంభకోణం అమెరికాలో ఎలాంటి సంచలనానికి దారి తీసింది. ఆ తర్వాత వారికి అమెరికా దర్యాప్తు సంస్థల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. హైదరాబాద్ ఏసీపీ అజిత్ కుమార్ భాటియా (సునీల్ శెట్టి) దర్యాప్తు ఎలా కొనసాగింది? అను, అర్జున్, సందీప్ ఈ కేసు నుంచి తప్పించుకొన్నారా? ఈ కేసు చివరకు ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే మోసగాళ్లు సినిమా కథ.