మిస్టర్ మన్మధన్ ఫర్ సేల్ సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిలంబరసన్, వరలక్ష్మి శరత్ కుమార్, శోభన్ బాబు, గణేష్ జనార్ధనన్, సంతానం, ప్రేమ్గి అమరన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విగ్నేష్ శివన్ నిర్వహించారు మరియు సంగీతదర్శకుడు ధరణ్ స్వరాలు సమకుర్చరు.
కథ
యానిమేటర్ అర్జున్ (శింబు) లండన్‌లో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా బండి లాగిస్తూంటాడు. అంతేకాకుండా పనిలోపనిగా ఆ దగ్గరలో ఉండే నిషా (వరలక్ష్మి శరత్‌కుమార్) తో ప్రేమలో పడతాడు. లండన్ లో ప్రెస్టీజియస్ డాన్స్ కాంపిటేషన్ లో గెలవటం ఆమె జీవితాశయం. అయితే మన అర్జున్ కు ఇలాంటివి అంటే గిట్టదు. అయితే ఒకరితో మరొకరు డీప్ గా ప్రేమలో పడిపోవటంతో ఓ ఎగ్రిమెంట్ రాసుకుని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత కొన్ని సంఘటనలతో వాళ్లు విడిపోయే సిట్యువేషన్ వస్తుంది. ఏమిటా సంఘటనలు..అసలు ఆ ఎగ్రిమెంట్ ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.