మిస్టర్ పెళ్ళికొడుకు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునీల్, ఇషాఛావ్లా, రాఘన, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కాశీవిశ్వనాథ్, మధు, ఖలీల్, తులసి, ఉషశ్రీ తదితరులు నటించారు. ఈ సినిమాకి స్కీన్‌ప్లే, దర్శకత్వం: దేవీప్రసాద్ నిర్మించారు మరియు నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్.ఎ.రాజకుమార్ స్వరాలు సమకుర్చారు.
కథ
పెళ్లికోసం ఇండియా వచ్చిన ఎన్నారై బుచ్చిబాబు(సునీల్)కి మొదటి పెళ్ళిచూపుల్లో కనపడ్డ అంజలి(ఇషా ఛావ్లా) తెగ నచ్చేస్తుంది. అయితే ఆమెకు మాత్రం ఆల్రెడీ వేరే వాడు నచ్చి ఉన్నాడు. ఆ విషయం చెప్పి.. బుచ్చి బాబుని సైడ్ అయిపోమంటుంది. సరేనని వేరే చోట్లకు పెళ్ళి చూపులకు వెళ్ళిన బుచ్చిబాబుకు ఆమే మనస్సులో ఉండటంతో అక్కడ ఎవరూ నచ్చరు. తిరిగి అమెరికా వెళ్ళిపోదామనుకునేంతలో తన స్నేహితుడు పెళ్లకి కేరళ వెళ్లాల్సివస్తుంది. అక్కడ అంజలి మళ్లీ కనిపిస్తుంది. అప్పుడేం జరుగుతుంది. చివరకు బుచ్చిబాబు తన మనస్సుకు దగ్గరైన అంజలినే పెళ్లిచేసుకున్నాడా అనేది మిగతా కథ.