మున్నా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, ఇలియాన, ప్రకాష్ రాజ్,కోటా శ్రీనివాస రావు, రాహుల్ దేవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హరీశ్ జయరాజ్ స్వరాలు సమకుర్చారు.
కథ
మున్నా ( ప్రభాస్ ) కాలేజి లో చదువుతుంటాడు. నగరంలో వున్నా మాఫియా ని లేకుండా చేయాలనుకుంటాడు మున్నా, మాఫియా డాన్ కాఖా ( ప్రకాశ్ రాజ్ ) సిటి అంత తనూ చేప్పినట్లు నడుస్తుంది. శ్రీనివాస రావు ( కోట శ్రీనివాస రావు ) కాక కు వ్యతిరేకంగా వుంటాడు కాని రావు ని చంపుతారు, ఇది ఇలా వుండగా మున్నా క్లాస్ మేట్ నిధి ( ఇలియానా) ప్రేమలో పడుతుంది. ఇంకోక డాన్ ఆత్మ ( రావుల్ దేవ్ ) గ్రూపు లో మున్నా చేరుతాడు. కాని అత్మ కూడా కాక మనిషి అని మున్నా తెలుసుకుంటాడు, అయితే ఇంకో ట్విస్ట్ ఎంటంటే కాక ను మున్నా ని ఆత్మ చంపాలని అనుకుంటాడు, వాళ్ళిద్దరిని మున్నా ఎలా చంపుతాడు అనేది మిగతా కథ