నా బంగారు తల్లి సినిమా సమాజం లో జరిగే లైంగిక అత్యాచారాల ప్రాధానాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు, ఇందులోసిద్దిఖీ, అంజలి పాటిల్, లక్ష్మీ మీనన్, రత్న శేఖర్ లు ముఖ్య పాత్రధారులుగా నటించారు. ఈ సినిమాకు రాజేష్ టచ్ రివర్ దర్శకత్వం చేశారు, ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్, ఎం ఎస్ రాజేష్ నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శాంతను మోయిట్ర స్వరాలు అందించారు.
కథ
అభంశుభం తెలియని ఎంతో మంది యువతులు లైంగిక వేధింపులకు గురవుతూ నరకప్రాయంగా జీవితాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి ఓ స్త్రీ జీవిత గాథే నా బంగారు తల్లి కధ అమలాపురంలో మొదలవుతుంది. శ్రీనివాస్ సమాజ సేవకుడు. అతని ఒక్కగానొక్కొ కూతురు దుర్గ మంచి చదువరి. ఇంటర్‌లో స్టేట్ ర్యాంక్ తెచ్చుకొన్న దుర్గ పైచదువులను హైదరాబాద్ కాలేజీలో చదవాలనుకుంటుంది.
పనిమీద హైదరాబాద్ వెళ్ళిన శ్రీనివాసరావుకు అమ్మాయిని జాగ్రత్తగా రిసీవ్ చేసుకోమంటుంది. ఈ హఠాత్‌పరిణామానికి శ్రీనివాసరావు షాక్ అయినా... కూతురంటే ప్రాణం గనుక ఆమెతో వారంరోజుల గడపడానికి నిర్ణయించుకుంటాడు. అయితే కుమార్తె ఓ లాడ్జ్‌లో బస ఏర్పాటు చేసి బయటకు వెళతాడు. తిరిగి వచ్చేసరికి దుర్గ వుండదు. ఎవరో అమ్మాయి వచ్చి తీసుకెళ్ళిందని చెబుతారు లాడ్జివాళ్ళు. ఇక ఆ తర్వాత దుర్గ బ్రోతల్ హౌస్‌కు తరలించబడుతుంది. అక్కడే తనకో రహస్యం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమయింది? అనేది సినిమా.