నచ్చింది గర్ల్‌ఫ్రెండూ సినిమా యాక్షన్, థ్రిల్లర్, ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్, సీనియర్ హీరో సుమన్, మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గురు పవన్ వహించారు. నిర్మాత అట్లూరి నారాయణ రావు నిర్మించారు. సంగీతం గిఫ్టన్ అందించారు.
కథ
బీకాం చదివిన రాజారాం (ఉదయ్ శంకర్) స్టాక్ మార్కెట్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. సాఫ్ట్‌వేర్‌లో సెక్యూరిటీ అనలిస్ట్ సంధ్య అలియాస్ శాండీ (జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. శాండీ ప్రేమను గెలుచుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు. కానీ శాండీని కలిసిన ప్రతీ ఒక్కరు అనుమానాస్పద రీతిలో మరణిస్తుంటారు. ఈ క్రమంలో రాజారాం లవ్ ప్రపోజల్‌ను శాండీ తిరస్కరిస్తుంది. శాండీని కలిసిన ప్రతీ వ్యక్తి ఎందుకు హత్యకు గురవుతుంటారు? శాండీకి పరిచయమైన వారిని ఎవరు హత్య చేశారు? శాండీ లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేయడంతో రాజారాం ఏం చేశాడు? రాజారాం ప్రేమలో చెర్రీ చెంగల్రావు (మధునందన్) పాత్ర ఏమిటి? ఈ కథలో కృష్ణ పాండే (శ్రీకాంత్ అయ్యంగార్), పేటీఎం ప్రసాద్ (పృథ్వీరాజ్), ముఖేష్ గౌరవ్ (సుమన్), విక్రమ్ రాయ్ పాత్రలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే నచ్చిందే గర్ల్‌ఫ్రెండూ సినిమా కథ.