X
నగరం
Action | Thriller | 10 Mar 2017 |
Telugu

నగరం స్టోరీ

నగరం (నాలుగు బతుకులు, మూడు చిక్కులు) సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్ కిషన్, శ్రీ, రెజీనా, మధుసుధన్, చార్లీ, రామ్ దోస్ తదితరులు నటించారు. ఈ సినిమాకి  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో లోకేష్ కానగరాజ్ నిర్వహించారు మరియు నిర్మాతలు అశ్వినీకుమార్ సహదేవ్, రాజేష్ దండా కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జావేద్ రిజ్ స్వరాలు సమకుర్చరు. 

కథ

సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్ఆర్‌గా పనిచేసే రెజీనా, సందీప్ కిషన్ లవర్స్. పనిపాట లేకుండా తిరిగే సందీప్ కిషన్ రెజీనా ప్రేమ కోసం తపిస్తుంటాడు. ఏదైనా ఉద్యోగం చేస్తేనే తాను ప్రేమను అంగీకరించలేదని స్పష్టం చేస్తుంది. తన ప్రేమను కాపాడుకోవడానికి పల్లెటూరు నుంచి నగరానికి వచ్చిన ఓ నిరుద్యోగి (శ్రీ) మంచి ఉద్యోగాన్ని సంపాదించాలనుకొంటాడు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి ఓ వ్యక్తి డ్రైవర్ (చార్లే) గా అవతారం ఎత్తుతాడు. ఇక నగరంలోనే పీకేపీ (మధుసూదన్) అనే పేరు మోసిన మాఫియా డాన్ ఉంటాడు. అలాగే చిన్న చితకా సెటిల్మెంట్ల దందా సాగించే ఓ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ అనుకోని పరిస్థితుల్లో మాఫియా డాన్ కుమారుడిని కిడ్నాప్ చేస్తారు. కథలో భాగంగా నగరంలోని వేర్వేరు ప్రదేశాల్లో జరిగే ఐదు ప్రధాన కథాంశాలు. అయితే సందీప్, శ్రీ ఇద్దరు మంచి ఉద్యోగాలు సంపాదించి ప్రేమను దక్కించుకొన్నారా? డ్రైవర్ తన కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డాడా? మాఫియా డాన్ తన కుమారుడిని సురక్షితంగా రక్షించుకొన్నాడా? రౌడీ మూక ఎందుకు మాఫియా డాన్ కొడుకును కిడ్నాప్ చేశారు? ఈ క్రమంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని వారు ఎలా ఎదుర్కొన్నారనే ప్రశ్నలకు సమాధానం నగరం చిత్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+