X
నగరం

నగరం

Action | Thriller | 10 Mar 2017 |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

నగరం స్టోరీ

నగరం (నాలుగు బతుకులు, మూడు చిక్కులు) సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్ కిషన్, శ్రీ, రెజీనా , మధుసుధన్, చార్లీ, రామ్ దోస్ తదితరులు నటించారు. ఈ సినిమాకి  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో లోకేష్ కానగరాజ్ నిర్వహించారు మరియు నిర్మాతలు అశ్వినీకుమార్ సహదేవ్, రాజేష్ దండా కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జావేద్ రిజ్ స్వరాలు సమకుర్చరు.  కథ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్ఆర్‌గా పనిచేసే రెజీనా, సందీప్ కిషన్ లవర్స్. పనిపాట లేకుండా తిరిగే సందీప్ కిషన్ రెజీనా ప్రేమ కోసం తపిస్తుంటాడు. ఏదైనా ఉద్యోగం చేస్తేనే తాను ప్రేమను అంగీకరించలేదని స్పష్టం చేస్తుంది. తన ప్రేమను కాపాడుకోవడానికి పల్లెటూరు నుంచి నగరానికి వచ్చిన ఓ నిరుద్యోగి (శ్రీ) మంచి ఉద్యోగాన్ని సంపాదించాలనుకొంటాడు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి ఓ వ్యక్తి డ్రైవర్ (చార్లే) గా అవతారం ఎత్తుతాడు. ఇక నగరంలోనే పీకేపీ (మధుసూదన్) అనే పేరు మోసిన మాఫియా డాన్ ఉంటాడు. అలాగే చిన్న చితకా సెటిల్మెంట్ల దందా సాగించే ఓ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ అనుకోని పరిస్థితుల్లో మాఫియా డాన్ కుమారుడిని కిడ్నాప్ చేస్తారు. కథలో భాగంగా నగరంలోని వేర్వేరు ప్రదేశాల్లో జరిగే ఐదు ప్రధాన కథాంశాలు. అయితే సందీప్, శ్రీ ఇద్దరు మంచి ఉద్యోగాలు సంపాదించి ప్రేమను దక్కించుకొన్నారా? డ్రైవర్ తన కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డాడా? మాఫియా డాన్ తన కుమారుడిని సురక్షితంగా రక్షించుకొన్నాడా? రౌడీ మూక ఎందుకు మాఫియా డాన్ కొడుకును కిడ్నాప్ చేశారు? ఈ క్రమంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని వారు ఎలా ఎదుర్కొన్నారనే ప్రశ్నలకు సమాధానం నగరం చిత్రం.
Read More

నగరం కాస్ట్ & క్రూ

నగరం సిబ్బంది సమాచారం

దర్శకత్వం లోకేష్ కానగరాజ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రాజేష్ దండా
నిర్మాత రాజేష్ దండా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నగరం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అనేక సమస్యలో కూరుకుపోయిన నగరం నుంచి వెళ్లి పోవాలనుకున్న సందీప్ కిషన్ మళ్లీ మనసు మార్చుకోవడం, అలాగే పల్లెటూరు నుంచి ఉద్యోగం కోసం వచ్చిన శ్రీ నగరం వల్ల ఒరిగేది ఏమిలేదు. ఊరే మంచిది అనే భావన నుంచి బయటపడి నగరమే మంచిది అనే ఫీలింగ్ కల్పించిన సన్నివేశాలు దర్శకుడి పనితీరుకు అద్దం పట్టాయి. ఉన్న ఊరిలోనే ఉండటం మానసికంగా స్థైర్యమని సందీప్ చేత, ఎవరో నలుగురి వల్ల కలిగిన ఇబ్బందులతో నగరంపై చెడు అభిప్రాయాన్ని కలిగించుకోవడం అని చెప్పిన అంశాలు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతాయి. పిల్లాడి కిడ్నాప్ డ్రామాలో మాఫియా డాన్, రౌడీ మూకల మధ్య జరిగే ఎత్తులు పైఎత్తులు యాక్షన్ ప్రేమించే ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి. కుమారుడి కోసం డాన్ పడే తపన‌తో మంచి సెంటిమెంట్ వర్కవుట్ అయింది. ఇలాంటి అనేక ప్రత్యేకతలతో రొటీన్‌కు భిన్నంగా ఉన్న చిత్రమనే అభిప్రాయం ప్రేక్షకుడికి ఈ చిత్రం కల్పిస్తుంది. మూస చిత్రాలను కాకుండా డిఫరెంట్ చిత్రాలను ఆశించే ఆడియెన్స్‌కు నగరం చిత్రం ఫుల్ మీల్స్ లాంటింది. అంతేకాకుండా పైసా వసూల్ సినిమా అని బల్ల గుద్ది చెప్పవచ్చు.

నగరం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నగరం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+