నాగవల్లి సినిమా థ్రిల్లర్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, కమలిని ముఖర్జీ, రిచా గంగోపాధ్యాయ, అనుష్క, శ్రద్దాదాస్, బ్రహ్మనందం, శారత్ బాబు, దర్మవరపు సుబ్రమాణ్యం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కధ, స్క్రీన్, ప్లే, దర్శకత్వం: పి.వాసు నిర్వహించారు మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గురుకిరణ్ స్వరాలు సమకుర్చారు.
కథ
చంద్రముఖి చిత్రపటం..దాని వల్ల వచ్చిన సమస్యలు అనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. డాన్స్ కాంపిటేషన్ లో గిప్ట్ గా వచ్చిన చంద్రముఖి చిత్రపటం అందుకున్న గాయిత్రీ(కమలినీ ముఖర్జీ) వెంటనే తన భర్తని యాక్సెడెంట్ లో కోల్పోతోంది. అంతేగాక ఆ చిత్రపటం ఎఫెక్టుతో ఆమె ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. అలాగే ఆ ఇంటిలో ఉంటున్న గాయిత్రి చెల్లెళ్ళు గీత( శ్రద్ధ దాస్), గౌరీ(రిచా గంగోపాద్యాయ) విచిత్రంగా బిహేవ్ చేస్తూంటారు. దాంతో పరిశోధనకు సైక్రాటిస్ట్ ఈశ్వర్ (చంద్రముఖి లో రజనీకాంత్) శిష్యుడు విజయ్(వెంకటేష్) అక్కడికి వస్తాడు. అతను..చంద్రముఖి అస్సలు ఆ కుటుంబంలో ఎవరిని ఆవహించింది..అలాగే తన పోలికలతో ఉన్న రాజా నాగభైరవ(వెంకటేష్) ఎవరు..ఆయనకీ, చంద్రముఖికీ, ఈ కేసుకీ ఉన్న సంభందం ఏమిటన్నది తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.