X
తెలుగు » సినిమాలు » నాగవల్లి
నాగవల్లి

నాగవల్లి

Thriller | 16 Dec 2010 | A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

నాగవల్లి స్టోరీ

నాగవల్లి సినిమా థ్రిల్లర్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, కమలిని ముఖర్జీ, రిచా గంగోపాధ్యాయ, అనుష్క, శ్రద్దాదాస్, బ్రహ్మనందం, శారత్ బాబు, దర్మవరపు సుబ్రమాణ్యం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కధ, స్క్రీన్, ప్లే, దర్శకత్వం: పి.వాసు నిర్వహించారు మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గురుకిరణ్ స్వరాలు సమకుర్చారు. కథ చంద్రముఖి చిత్రపటం..దాని వల్ల వచ్చిన సమస్యలు అనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. డాన్స్ కాంపిటేషన్ లో గిప్ట్ గా వచ్చిన చంద్రముఖి చిత్రపటం అందుకున్న గాయిత్రీ(కమలినీ ముఖర్జీ) వెంటనే తన భర్తని యాక్సెడెంట్ లో కోల్పోతోంది. అంతేగాక ఆ చిత్రపటం ఎఫెక్టుతో ఆమె ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. అలాగే ఆ ఇంటిలో ఉంటున్న గాయిత్రి చెల్లెళ్ళు గీత( శ్రద్ధ దాస్), గౌరీ(రిచా గంగోపాద్యాయ) విచిత్రంగా బిహేవ్ చేస్తూంటారు. దాంతో పరిశోధనకు సైక్రాటిస్ట్ ఈశ్వర్ (చంద్రముఖి లో రజనీకాంత్) శిష్యుడు విజయ్(వెంకటేష్) అక్కడికి వస్తాడు. అతను..చంద్రముఖి అస్సలు ఆ కుటుంబంలో ఎవరిని ఆవహించింది..అలాగే తన పోలికలతో ఉన్న రాజా నాగభైరవ(వెంకటేష్) ఎవరు..ఆయనకీ, చంద్రముఖికీ, ఈ కేసుకీ ఉన్న సంభందం ఏమిటన్నది తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.
Read More

నాగవల్లి కాస్ట్ & క్రూ

నాగవల్లి సిబ్బంది సమాచారం

దర్శకత్వం పి వాసు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గురుకిరణ్
నిర్మాత బెల్లంకొండ సురేశ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నాగవల్లి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పరాజయాలనుంచి తప్పించుకోవాలంటే మూలాలకి వెళ్ళి సరిచేసుకోవాలి అని వెంకటేష్ నమ్మినట్లున్నాడు. రీమేక్ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా వెలిగి, ఎదిగిన వెంకటేష్ వాటికి బ్రేక్ ఇచ్చి స్ట్రైయిట్ సినిమాలు చేసి దెబ్బ తిన్నాడు. దాంతో రీమేక్ లే రక్ష అని చంద్రముఖి వంటి సూపర్ హిట్ కి సీక్వెల్, కన్నడ చిత్రం ఆప్త రక్షకకు రీమేక్ అయిన నాగవల్లి నమ్ముకున్నాడు. అయితే చంద్రముఖి సీక్వెల్ అనే ప్రచారమే ఈ చిత్రాన్ని ఇబ్బందుల్లో పడేసింది. చంద్రముఖిని రేంజిని ఊహించుకుంటూ ధియోటర్ కి వచ్చిన ప్రేక్షకులు ఆ చిత్రంతో పోలుస్తూ నాగవల్లిని చూసి పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా చంద్రముఖిలో హైలెట్ గా నిలిచిన స్క్రీన్ ప్లే, క్లైమాక్సే ఈ చిత్రానికి మైనస్ గా మారింది. ఇక అలాగే చంద్రముఖిలో సక్సెస్ కి కీలకం అయిన 'లకలకలక డైలాగు'..ఈ సారి 'ఔరా...ఔరా..' అంటూ అరిగిపోయిన రికార్డులా విసుగు తెప్పించింది. వెంకటేష్ మూడు గెటప్స్ లో కనిపించినా కిక్కు ఇవ్వలేకపోయాడు. కొద్ది పాటి ధ్రిల్స్ ఉన్న ఈ చిత్రం కొద్ది మందికే నచ్చే అవకాసం ఉంది.

నాగవల్లి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నాగవల్లి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+