నాతో నేను సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయికుమార్, శ్రీనివాస్, అదిత్య ఓమ్, దీపలి రాజ్ పుత్, ఐశ్వర్య వుల్లింగల, విజయ్ చందర్, రాజీవ్ కనకాల తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాంతి కుమార్ తుర్లపాటి అందించారు. నిర్మత ప్రశాంత్ తంగుటురి నిర్మంచారు. సంగీతం సత్య కౌశ్యాప్ అందించారు.
కథ
జీవితంలో వివిధ దశల్లో చోటు చేసుకొన్న అనేక వైఫల్యాలను అధిగమించిన కోటేశ్వరరావు (సాయికుమార్) ఉన్నతస్థాయికి చేరుకొంటారు. తనను వేధిస్తున్న కొన్ని సమస్యల కారణంగా ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవాలని అనుకొంటాడు. ఆ సమయంలో ఆ ఊరికి వచ్చిన స్వామిజీ ఎదురుపడి కోటేశ్వరరావుకు ఓ వరం ఇస్తాడు. అయితే ఆ వరం గురించి ఎవరికీ చెప్పకూడదని కోటేశ్వరరావు దగ్గర స్వామిజీ మాట తీసుకొంటాడు. కోటేశ్వరరావు జీవితంలో చోటు చేసుకొన్న వైఫల్యాలు ఏమిటి? ఉన్నత స్థితికి చేరుకొన్న కోటేశ్వరరావు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకొన్నాడు? కోటేశ్వరరావుకు స్వామిజీ ఎలాంటి ధైర్యం చెప్పాడు? స్వామిజీ ఎలాంటి వరాన్ని కోటేశ్వరరావుకు ఇచ్చాడు? వరాన్ని పొందిన కోటేశ్వరరావు జీవితంలోకి చీకట్లు పోయి వెలుగులు వచ్చాయా? స్వామిజీ వరంతో కష్టాలను తొలగించుకొని సంతోషాలు చేజిక్కించుకొన్నాడా? కోటేశ్వరరావు జీవితంలో దీప (ఐశ్వర్య), నాగలక్ష్మీ (దీపాళీ) ఎలాంటి ప్రభావం చూపారు అనే ప్రశ్నలకు సమాధానమే నాతో నేను సినిమా.