నాట్యం (2021)(U)
Release date
22 Oct 2021
genre
నాట్యం స్టోరి
నాట్యం మూవీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంధ్య రాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ, రుక్మిణి విజయకుమార్, హైపర్ ఆది, బేబీ దీవెన తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రేవంత్ కోరుకొండ వహించారు. సంగీతం శ్రావణ్ భరద్వాజ్ అందించారు.
కథ
భారతీయ కళలకు, సంస్కతికి పుట్టినిల్లు లాంటి నాట్యం అనే గ్రామంలో సితార (సంధ్యా రాజు (సత్యం రామలింగ రాజు కోడలు)) గొప్ప నృత్యకారిణి కావాలని, అదే గ్రామంలో రంగ ప్రవేశం చేయాలని కోరుకొంటుంది. గురువు (ఆదిత్య మీనన్), ఆయన కుమారుడు హరి (కమల్ కామరాజ్) పర్యవేక్షణలో నృత్యంలో ప్రావీణ్యం సంపాదిస్తుంది. తన చిన్న నాటి కలగా మిగిలిని కాదంబరి కథను నృత్య రూపకంలో చెప్పాలని కలలు కంటుంది. అయితే గ్రామ పెద్ద (శుభలేఖ సుధాకర్) కుట్ర వల్ల ఆ గ్రామం నుంచి హైదరాబాద్‌కు రోహిత్ ( రోహిత్ బెహల్) సహాయంతో పారిపోతుంది. కాదంబరి నృత్యరూపకాన్ని ప్రదర్శించాలనే కోరికకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయి. నాట్యం గ్రామానికి వచ్చిన రోహిత్‌తో కలిసి సితార ఎందుకు పారిపోయింది. తన గురువ కుమారుడు హరి తనపై ఎందుకు పగను పెంచుకొన్నాడు. తన చిన్ననాటి కలకు అడ్డు పడిన గ్రామ పెద్దను ఎలా ఎదురించింది. కాదంబరి కథను అమెరికాలో ఎందుకు ప్రదర్శించాలని నిర్ణయం తీసుకొన్నది. చివరకు సొంత ఊరిలో గురువు ఆశీస్సులతో రంగ ప్రవేశం చేసిందా అనే ప్రశ్నలకు భావోద్వేగమైన సమాధానమే నాట్యం సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie నాట్యం with us? Please send it to us ([email protected]).