నేనే వస్తున్నా (2022)(U/A)
Release date
29 Sep 2022
genre
నేనే వస్తున్నా స్టోరి
నేనే వస్తున్నా మూవీ యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధనుష్, ఇల్లి రామ్, యోగి బాబు తదితరులు నటించారు. ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించగా , యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని తెలుగులో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేయనున్నారు.
కథ
కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగి అయిన ప్రభు (ధనుష్) తన భార్య భువన (ఇందుజా రవిచంద్రన్), కూతురు సత్యతో ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. ఉత్తర భారతంలో విహార యాత్ర చేసిన తర్వాత కూతురు సత్య మానసిక పరిస్థితి ఒకరకంగా మారిపోతుంది. తనలో తాను మాట్లాడుకోవడం, నిద్రలేమి సమస్యను సత్యను వెంటాడుతుంటాయి. అయితే సైక్రియాటిస్ట్ (ప్రభు)ను సంప్రదిస్తే.. సత్యను ఆత్మను వెంటాడుతుందని విషయం తెలుస్తుంది. సత్యను ఆత్మ ఎందుకు వెంటాడుతుంది? ప్రభు తన సోదరుడు కదిర్ (ధనుష్)కు ఎందుకు దూరమయ్యాడు? కదీర్ను ఆయన సొంత భార్య, పిల్లలు ఎందుకు వ్యతిరేకిస్తారు. కదీర్ నుంచి ఆయన కుటుంబం ఎందుకు పారిపోవాలని ప్రయత్నిస్తారు? తన కుటుంబంపై కదీర్ ఎందుకు కసి పెంచుకొంటాడు? అనే ప్రశ్నలకు సమాధానమే నేనే వస్తున్నా మూవీ కథ.
**Note:Hey! Would you like to share the story of the movie నేనే వస్తున్నా with us? Please send it to us ([email protected]).