సీమ నేపధ్యంలో గాని యాసలో గాని వచ్చే సినిమాలకు చాలా మంచి క్రేజ్ ఉంటుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలు అనగానే ఫ్యాక్షనిజం,కత్తులు..పగలు ,ప్రతీకారాలు ఇవే గుర్తొస్తాయి. ప్రతీకారాలు, గొడవలు, రక్తపాతం వంటివి మన దర్శకులు సరిగా తీస్తే ఆ సినిమాకి క్రేజ్ ఒక లెవెల్ లో ఉంటుంది. కానీ సినిమాల్లో చూపించేది నిజం కాదు అని రాయలసీమ వాసులు కొట్టిపడేస్తుంటారు. సీమ ప్రేమకు పెట్టింది పేరు. ఎక్కడ తక్కువ కాకుండా అథితులకు ఇచ్చే మర్యాదలు చెప్పనర్లేదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ప్రేమకథలు కూడా మిగతా లవ్ స్టోరీస్ కంటే డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పటివరకు దాదాపు తెలుగులో అందరు హీరోలు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో సినిమాలు చేసి మంచి సక్సెస్‌లు అందుకున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ వచ్చిన టాప్ 10 మూవీస్ గురించి చూద్దాం