నేను లేను సినిమా యాక్షన్, రొమాంటిక్, ఎంటర్టైనర్ చిత్రం ఇందులో హర్శిత్, శ్రీ పద్మ, మాధవి, బిశ్వజిత్నాథ్, వేల్పుల సూరి, యుగంధర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాము కుమార్ ఎ ఎస్ కె వహించారు మరియు నిర్మాత సుక్రి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఆశ్రిత్ సమకూర్చారు.
కథ
కర్నూలుకు చెందిన ఈశ్వర్ (హర్షిత్) ఓ వీడియోగ్రాఫర్. తొలిచూపులోనే పార్వతి (శ్రీ పద్మ) అనే యువతి ప్రేమలో పడుతాడు. ఇంట్లో చెబితే తమ పెద్దలు ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరనే ఉద్దేశంతో పారిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేస్తారు. ఆ క్రమంలో ఓ రౌడీ మూక బారిన పడుతారు? తన ప్రేయసి ప్రాణాలకు ముప్పు రావడంతో ఆ గ్రూప్‌ను అంత మొందిస్తాడు ఈశ్వర్. ఆ క్రమంలో మరో గ్యాంగ్ నుంచి హర్షిత్, పార్వతికి ముప్పు ఏర్పడుతుంది? ఈ నేపథ్యంలో ఈశ్వర్ కోటార్డ్ సిండ్రోమ్ అనే డిజార్డర్‌తో బాధపడుతున్నారనే విషయం బయటపడుతుంది? కోటార్డ్ సిండ్రోమ్ వల్ల ఈశ్వర్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? పార్వతితో ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులను అధిగమించాల్సి వచ్చింది. తన స్నేహితుడు (వంశీకృష్ణ పాండ్య) నుంచి ఎలాంటి సహకారం అందింది? రౌడీ మూకల ఎలా ఎదురించి తన ప్రేమను, తనకు తాను ఎలా కాపాడుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే నేను లేను.