X
నేను లోకల్
Romance | 03 Feb 2017 | U/A |
Telugu

నేను లోకల్ స్టోరీ

నేను లోకల్ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, కీర్తి సురేష్, నవీన్ చంద్ర, పోసాని కృష్ణమురళి, సచిన్ కేడెకర్, ప్రభాస్ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రినాథరావు నక్కిన నిర్వహించారు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు. 

కథ

స్లిప్పులు పెట్టి ఇంజీనీరింగ్ పాసైన బాబు(నాని) వాట్ నెక్ట్స్ అనే డైలామాలో ఉన్నప్పుడు (కీర్తి సురేష్) పరిచయం అవుతుంది. సినిమా రూల్ ప్రకారం...ఆమె హీరోయి న్ కాబట్టి..వెంటనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేస్తాడు. అంతేకాకుండా ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు.  అంతేకాకుండా తన తండ్రి (సచిన్ కేడ్కర్) మాట వేదంలా భావించి స్ట్రిక్టుగా ఉండే కీర్తిని ప్రేమలో దింపడానికి తను చదివే కాలేజ్ లో ఎం.బి.ఏలో జాయిన్ అవుతాడు. నిన్ను డిస్ట్రబ్ చేస్తా అని ప్రకటించి ఆ పనిలో ఉంటాడు. కానీ నేను డిస్ట్రబ్ కాను అంటూనే ఆమె మనస్సు డిస్ట్రబ్ చేసుకుని ప్రేమలో పడిపోతుంది. అయితే ఈ ప్రేమ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చి ఇంటర్వెల్ వచ్చే సమయానికి... పోలీస్ అధికారి సిద్ధార్థ్ వర్మ(నవీన్ చంద్ర) ఊడిపడతాడు. అతను ఆల్రెడీ గత నాలుగేళ్లుగా ఆమె ప్రేమిస్తున్న సీనియర్ ప్రేమికుడు. అయితే కీర్తి తండ్రి ..నీకు ఏం చూసి నా కూతురుని ఇవ్వాలి అంటే... కష్టపడి చదవి, పోలీస్ ఉద్యోగం కొట్టి వచ్చి మరీ నీ కూతురుని ఇచ్చి పెళ్లి చేయమంటాడా నిజాయితీ గల ప్రేమికుడు. ఊహించని విధంగా ఇలా ఓ సీనియర్ ప్రేమికుడు సీన్ లోకి వచ్చేసరికి..జూనియర్ ప్రేమికుడు అయిన మన హీరో నాని సమస్య ఎదురౌతుంది. కీర్తి ఏమో ..ఈ జూనియర్ ని ప్రేమిస్తూ మొగుడు కావాలని కోరుకుంటోంది. కీర్తి తండ్రి ఏమో ...సీనియర్ ప్రేమికుడుని తన అల్లుడు కావాలని కోరుకుంటున్నాడు. మరి ఎవరికి దక్కుతుంది కీర్తి అంటే..ఆబియస్ గా హీరోకే దక్కుతుంది. అయితే ఎలా హీరో...తన సీనియర్ ని దాటి ..ఆమె చేయందుకున్నాడు అనేది మిగతా కథ. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+