X
నేను నా రాక్షసి
Action | Romance | 29 Apr 2011 | U/A |
Telugu

నేను నా రాక్షసి స్టోరీ

నేను నా రాక్షసి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాణా, ఇలియానా, సుబ్బరాజు, అలీ, అభిమన్యు సింగ్‌, ముమైత్‌ ఖాన్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్వహించారు మరియు నిర్మాత నల్లమలుపు శ్రీనివాసు (బుజ్జి) నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు విశ్వ రెహమాన్ స్వరాలు సమకుర్చరు.

కథ

అభిమన్యు (రాణా)తన వృత్తిలో బాగా పండిపోయిన ప్రొఫెషనల్ కిల్లర్.మీనాక్షి (ఇలియానా)ఆత్మహత్యలు చేసుకునే వారి చివరి మాటలను వీడియో తీసి 'ఇట్స్ మై లైఫ్ బాస్'పేరుతో యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూండే అమ్మాయి.అందమైన అమ్మాయికి ఇదేం పిచ్చి అనుకోకండి ..దానికో అద్బుతమైన ప్లాష్ బ్యాక్ ఉంది .ఇక అభి,మీనాక్షి ఓ రోజు అనుకోని పరిస్ధితుల్లో కలుస్తారు.వెంటనే ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడిన అభి ఆమె వెనక రెగ్యులర్ తెలుగు సినిమా హీరోలా తన పనులన్నీ ప్రక్కన పెట్టి మరీ తిరుగుతూంటాడు.మరో ప్రక్క యూ ట్యూబ్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సి.ఐ విక్రమ్ (సుబ్బరాజు)ఎవరు ఈ పని చేస్తున్నారంటూ ఎంక్వైరీ ప్రారంభిస్తాడు.ఆయనకి కాన్సర్ తో చనిపోబోతున్న కూతురు.అదో విషాద గాధ. ఇలా ఎడా పెడా చావులతో కధ నడుస్తూండగా అంతవరకూ కోమాలో ఉన్న అభి తల్లి చనిపోతుంది. దాంతో జీవితం మీద విరక్తికలిగి(అప్పటికి మనకీ విరక్తి కలుగుతుందనుకోండి)ఆత్మ హత్య చేసుకోవాలని తన వీడియో కూడా తీసి యూట్యూబ్ లో పెట్టమని ఆమెనే పిలుస్తాడు.అప్పుడేం జరిగింది.అభి ఆత్మహత్య చేసుకున్నాడా.సిఐ విక్రమ్ ఈ కేసుని ఎలా ఛేదించాడు.మీనాక్షి దొరికిపోయిందా..అభి ప్రొఫెషనల్ కిల్లర్ గా మారటానికి కారణమేంటి అనేది తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే తెరపై చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+